ప్రస్తుతం హిందూ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికీ మహాభారతం గురించి తప్పక తెలిసే ఉంటుంది. ఇందులో శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా కృష్ణుడి రూపంలో అవతరించాడని మనకు తెలిసిన విషయమే. ఈ అవతారంలో తల్లిగా ఉన్న దేవకి శ్రీకృష్ణుడి తల్లిగా అంతా అనుకుంటున్నారు. మరియు శ్రావణ మాసంలోని క్రిష్ణ పక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీక్రిష్ణుడికి దేవకి, యశోద ఇద్దరు తల్లులు ఉన్నారని కూడా మరి కొంత మంది అనుకుంటారు. అంతే కాకుండా చాలా సినిమాలలోనూ మరియు సీరియల్స్ లోనూ వీరినే చూపిస్తూ ఉంటారు. ఈ కారణాల వలన శ్రీకృష్ణుడికి ఇద్దరు అమ్మలున్నట్లు అందరూ అనుకున్నారు.

అయితే కొంత సమాచారం ప్రకారం వీరిద్దరితో పాటుగా మరి కొంతమంది తల్లులున్నారని తెలుస్తోంది. మరి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసుదేవుడు దేవకిలకు పుట్టిన కృష్ణుడిగా మనకు తెలిసిందే. అయితే దేవకి కన్నా ముందు వసుదేవుడికి రోహిణితో పెళ్లి అయింది.  బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానంగా ఉంటారు. ఆ కారణంగా రోహిణి కృష్ణుడికి తల్లి వరుస అయింది. ఈ మాధవుడు...సందీపని భార్య యైన సుముఖి దేవికి కూడా తనకు తల్లి అయ్యే అదృష్టాన్ని ప్రసాదించాడు. అప్పట్లో శ్రీకృష్ణుడు సందీపని మహర్షి దగ్గర శిక్షణ పొందేవారు. అటువంటి సమయంలో సుముఖి దేవి శ్రీకృష్ణుడిని తన పుత్రుడిగా ఉండేలా గురు దక్షిణ అడుగుతుంది.

ఆ విధంగా ఆమె కూడా తల్లి అయింది. దాని తరువాత భాగవతం ప్రకారం గోకులంలో ఉన్న సమయంలో శ్రీకుష్ణుని చమపడానికి కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు. ఆ రాక్షసి కృష్ణుడిని చంపడానికి తన రొమ్ముల్లో కల కూడా విషాన్ని నింపుకుని వస్తుంది. తన మాయతో ఇది తెలుసుకున్న శ్రీ కృష్ణుడు పాలతో పాటు రొమ్ములను చీల్చి ఆ రాక్షసిని చంపేస్తాడు. పూతన అంతిమ సంస్కారాల సమయంలో తన శరీరం నుండి గంధపు చెక్కల సువాసన వస్తుంది. ఆ సంఘటన తరువాత ఈమెకు కూడా శ్రీకృష్ణుడు తల్లి అయ్యే హక్కును కల్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి మొత్తం అయిదు మంది తల్లులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: