హిందూ సంప్రదాయంలో హిందువులందరూ ఎన్నో సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. కొందరికి వాటి యొక్క పరమార్థం తెలియకపోయినప్పటికీ తమ పెద్దవారి నుండి వారసత్వంగా వస్తున్న ఆచారాలు కాబట్టి పాటించాలని ఉద్దేశంతో చేసుకుపోతూ ఉంటారు. ఇదే తరహాలో నదుల్లో, జలపాతాల్లో ఇలా ప్రవహించే నీటిలో నాణేలు వేయడం మన పూర్వం నుండి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారమే. ఇప్పటికీ ప్రజలు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారికి శుభం కలుగుతుందని కోరిన కోరికలు తీరుతాయని ఒక విశ్వాసం. పారే నీళ్లు కనిపిస్తే చాలు వెనక్కి తిరిగి నాణేలు వేసి నీటికి నమస్కారం చేసి దేవుని ప్రార్ధిస్తుంటారు. అయితే ఈ ఆచారం అప్పట్లో పాటించడానికి ఓ బలమైన కారణం ఉంది.
కాని ఇప్పుడు ఇదే ఆచారాన్ని కొనసాగించడం వలన ఎన్నో సమస్యలు వస్తున్నాయని, అవి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నది అని అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఇంతకీ విషయం ఏమిటంటే. నీటిలో నాణెం వేసి కోరుకోవడం ద్వారా అనుకున్నది జరుగుతుంది అన్న ఆచారం మన పూర్వీకుల నుండి వస్తున్నది. అప్పటి కాలం లో ప్రజలందరూ నదిలో నీటిని తాగే వారు. ఇప్పట్లో ఉన్నటువంటి ఫిల్టరింగ్ సదుపాయాలు అప్పట్లో ఉండేవి కాదు. అలాగే అప్పటి కాలంలో ఇనుముతో చేసిన నాణేలు కాదు. రాగితో తయారైన నాణేలు వినియోగంలో ఉండేవి. అయితే రాగికి నీటిని శుభ్రపరిచే గుణం ఉంది.
అందుకే నీటిలో వేసి నీటిని పరిశుభ్ర పరుచుకునేవారు. అలా ఆ పద్దతి మొదలయ్యింది. అది ఎంతో ఉపయోగకరమైన కార్యం అయినందున మన పెద్దలు ఈ పద్ధతిని కొనసాగించారు. అయితే ఇప్పటి కాలంలో రాగి నాణేలు అందుబాటులో లేవు వాటికి బదులుగా ఇనుప నాణాలు అమలులో ఉన్నాయి. ఇవి నీటిలో వేయడం వలన నీరు శుభ్రపడదు సరి కదా. ఈ ఇనుప నాణాలకు తుప్పు పట్టి నీటిని కలుషితం చేస్తాయి. దీనివలన నీటిలో నివసించే జీవరాశులకు, ఈ నీటిని తాగే వారి ఆరోగ్యానికి హానికరం.
మరింత సమాచారం తెలుసుకోండి: