మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది పోతుంది. అయితే  శివరాత్రి పర్వదినం రోజున మనం ఏ విధంగా పూజా విధానాన్ని చేసుకోవాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాం. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అయితే ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుని ప్రత్యేక నామాలతో కొలుస్తూ వుంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియా శివాహ అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం నువ్వు పంచామృతాలు పెట్టనవసరం లేదు. శివుడిపై కొన్ని నీళ్లు పోసి నా చాలు.

 శివుడికి జలం  అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు గరళాన్ని మింగాడు. అలహాలాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు పంచామృతాన్ని చిలికే సమయంలో ముందు వచ్చినటువంటి విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు. అయితే ఇది కంఠం దిగి కిందికి పోకుండా పైకి రాకుండా కంఠంలోనే ఉండడం వల్ల చాలా వేడిగా ఉంటుంది. అందుకే మనం శివునికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది. కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి. అందుకే ఆయన మంచుకొండల్లో ఉంటాడని అంటుంటారు. ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో కుమార స్వామిని ప్రేమించినంతగా ప్రేమ ఇస్తారట. ముఖ్యంగా శివరాత్రి పర్వదినం చూసుకుంటే అభిషేకము, జాగరణ, ఉపవాసము ఉంటాయి. ముఖ్యంగా ఉపవాసం అంటే ఆ రోజు మనం పూర్తిగా ఏమీ తినకుండా శివ నామస్మరణ చేస్తూ ఉంటాం. దీంతోనే రోజంతా గడుపుతూ ఉంటాం.

 రెండవది జాగరణ  నిద్ర పోకుండా ఉండి, మెలకువతో ఉండడం. మెలకువతో అంటే  నువ్వు సినిమాలు చూస్తూ మెలకువగా ఉండకూడదు. శివుని కథలు పాటలు స్మరణ చేస్తూ మాత్రమే మెలకువతో ఉండాలి. దీన్నే శివరాత్రి జాగారం అని అంటాం. అభిషేకం శివునికి మనం ఎన్ని రకాల ఆహార పదార్ధాలు పెట్టిన స్వామికి ప్రీతి పాత్రమైన అభిషేకం పాలతో కానీ, కొబ్బరినీళ్ళతో కానీ,చక్కెరతో కానీ, అన్నంతో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిది. అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ మూడు నియమాలు నిష్టగా పాటిస్తే  శుభం కలుగుతుంది అని పండితులు పూజారులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: