
ఈ పురాతన ఆలయంలో అత్యంత విలక్షణమైన శివలింగం ఉంది . అది చాలా చాలా పవర్ ఫుల్. పశ్చిమగోదావరి జిల్లా యనమదురు గ్రామంలో ఉన్న శక్తి స్వరాలయం లో శివలింగం ఉండదు. శివుడి విగ్రహం ఉంటుంది . అంతేకాదు పైగా శీర్షాసనం వేసిన భంగిమలో శివుడు ..శివలింగంపై దర్శనం ఇస్తాడు . ఇది చాలా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ శివుడితో పాటు పార్వతి దేవి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పానవటం మీద ఉండడం ఇక్కడ చాలా చాలా ప్రత్యేకంగా చూస్తాం.
మరీ ముఖ్యంగా మూడు నెలల పసికందు అయిన బాలసుబ్రమణ్యేశ్వర స్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు. ఆ దృశ్యం కల్లారా చూస్తేనే ఆనందంగా ఉంటుంది . మనసుకు చాలా హాయిగా ఉంటుంది . ఎన్ని బాధలు ఉన్నా సరే అక్కడికి వెళ్లి అమ్మవారు ఒడిలో బాలసుబ్రమణ్య స్వామి పడుకొని లాలిస్తున్న ది చూస్తే ఖచ్చితంగా మనసుకు ఏదో ప్రశాంతమైన ఫీలింగ్ కలుగుతుంది .
శివుడు తలకిందులుగా ఉండడానికి కారణం ఏమిటంటే..?
ఒకనాడు ఆ యమధర్మ రాజు..మహా శివుడి గురించి నిష్ట తపస్సు చేస్తూ ఉన్నాడట. ఇక అదే సమయంలో అక్కడ శివుడు తలకిందులుగా తపస్సు చేస్తుంటే.. పక్కనే పార్వతి పసిబాలుడైన సుబ్రమణ్యస్వామిని ఒడిలో బుజ్జగిస్తూ లాలిస్తుందట. కాగా అప్పుడే యముడు తపస్సు చేస్తూ..ఆ శివుడి మోక్షం కొరకు.. ఉన్నపళంగా శివుడిని ప్రత్యక్షం కమ్మని వేడుకొన్నాడట. శివుడు..యముడు కోరికను మన్నించి ఉన్న పలంగా.. సతీ సమేతంగా యదాస్థితిలో ప్రత్యక్షమయ్యారని అక్కడ స్థానికులు చెప్పుతూ ఉంటారు..!!
సుమారు వందేళ్ళ క్రితమే దేవాలయం తవ్వకాలలో బయటపడినట్లు అక్కడి జనాలు చెప్పుకొస్తున్నారు. తవ్వకాలలో శివుడిని విగ్రహం మూడు నెలల బాలసుబ్రమణ్యేశ్వర స్వామిని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి. అంతేకాదు ఈ గుడిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి చాలా మంచి జరుగుతుందట. మరీ ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఇక్కడికి వెళ్లి ఆ శివయ్య ని దర్శించుకోవడం ద్వారా దేవుడికి పూజలు చేయడం ద్వారా సర్వ పాపాలు తొలగిపోయి.. పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతారట. ఏ రోగమైన సరే వెంటనే నయమైపోతుందని భక్తులు ఎప్పటి నుంచి నమ్ముతూ వస్తున్నారు..!