చాలామంది శనివారం పూట శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు . ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కి చాలా ప్రీతికరమైన రోజు అది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా చాలామంది శనివారం పూట తిరుమల కి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుంది అని అది శుభ సూచికమని అనుకుంటూ ఉంటారు . అయితే తిరుమల అనగానే ముందు అందరికి గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి.  ఆ తర్వాత గుర్తొచ్చేది మాత్రం తిరుమలలో స్వామివారికి ప్రీతికరమైన లడ్డు . ఆ ల్లడు గురించి భక్తులకు సుపరిచితమే . అయితే స్వామివారికి లడ్డు మాత్రమే కాదు ఇంకొన్ని ప్రసాదలను కూడా నివేదిస్తారు.  ఈ విషయాలు చాలా తక్కువ మందికే తెలుసు. శ్రీవారికి ఏ ఏ సమయాలలో నైవేద్యం సమర్పిస్తారు..? అసలు స్వామివారికి నైవేద్యంగా ఏమి సమర్పిస్తారు ..? అనే విషయాలు ఇక్కడ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..!!


తిరుములలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎప్పుడు ఏ నైవేద్యం సమర్పిస్తారంటే :

* శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతీరోజూ కూడా  త్రికాల నైవేద్యం ఉంటుంది. అంటే నైవేద్య సమర్పణ మూడు సమయాల్లో ఉంటుంది అని అర్ధం.

* అది ఎలా అంటే..ఉదయం 5.30 గంటలకు, ఉదయం 10గంటలకు, రాత్రి 7.30 గంటలకు ఉంటుంది.

* వీటినే మొదటి గంట నైవేద్యం అని, రెండో గంట నైవేద్యం అని, మూడో గంట నైవేద్యంగా కూడా పిలుస్తారు.

* ఉదయం 5.30నిమిషాలకు మొదటి గంట నైవేద్యం సమర్పిస్తారు. ఆ నివేదనలో చక్రపొంగలి, కదంబం, పులిహోర, దద్ధ్యోజనం, మాత్ర ప్రసాదాలు, లడ్డూలు, వడలు లాంటివి నివేదిస్తారు.

* ఆ త్రువాత ఉదయం 10 గంటలకు రెండో గంట నైవేద్యం సమర్పిస్తారు. అప్పుడు ప్రసాదాలుగా పెరుగన్నం, చక్రపొంగలి, పులిహోర, మిర్యాల పొంగలి, సీర, సాకిరి బాత్ సమర్పిస్తారు.

* ఇక ఆ తరువాత  రాత్రి 7.30 నిమిషాలకు మూడో గంట నైవేద్యం సమర్పిస్తారు. ఈ ప్రసాదాల్లో కదంబం, మొలహోర, వడలు, తోమాల దోశలు, లడ్డూ పెడతారు. అంతేకాదు  ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా చెప్పే పిండిని కూదా శ్రీవారికి నివేదిస్తారు.

* వారంలో ఒక్కరోజు ఈ  ప్రసాదాల సంఖ్య పెరుగుతూ కూడా వస్తుంది.

* మరీ ముఖ్యంగా సోమవారం నాడు విశేష పూజ సందర్భంగా స్వామీ వారికి మొత్తంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.

* అంతేకాదు ఆ తరువాత మంగళవారం సమర్పించే నైవేద్యంలో మరింత ప్రత్యేకంగా ‘మాత్ర ప్రసాదం’ ఉంటుంది. అలాగే  మిగిలినవన్నీ కూడా నిత్యం సమర్పించేవే కచ్చితంగా ఉంటాయి.

* బుధవారం సమర్పించే ప్రసాదాల్లో ప్రత్యేకంగా స్వామీ వార్కి ఇష్టమైన పాయసం, పెసరపప్పు సమర్పిస్తారు.

* ఇక గురువారం నాడు సమర్పించే ప్రసాదాల్లో నిత్యం సమర్పించే ప్రసాదాలతో  పాటూ తిరుప్పావడ సేవ సందర్భంగా జిలేబీ, మురుకు, పాయసాలు స్పెషల్ గా నివేదిస్తారు.

* శుక్రవారం స్వామీ వారికి అభిషేక సేవ జరుగుతుంది. ఇది చాలా చాలా స్పెషల్. ఈ కారణంగా ఆ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు.

* స్వామీ వారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు  నివేదనలో కదంబం, చక్రపొంగళి, లడ్డూలు, వదలు, పులిహోర, దద్యోజనం, మిర్యాల పొంగలి, సీర, సేకరాబాత్, కదంబం, మొలహోర, తోమాల దోశలు సమర్పిస్తారు.

* మరింత ప్రత్యేకమైన ఏకదాశి, వైకుంఠ ఏకాదశి, ప్రత్యేక పర్వదినాల్లో స్వామీ వారికి దోశలు, శనగపప్పుతో చేసిన గుగ్గిళ్లను నివేదిస్తారు.

* ఇక నెలరోజులపాటు జరిగే ధనుర్మాస వ్రతంలో వెంకటేశ్వర స్వామికి బెల్లం దోశలను ప్రసాదంగా నివేదిస్తారు. ఇలా స్వామివారికి జరిగే నిత్య, పక్ష, వార, మాస, సంవత్సరాది ఉత్సవాల్లో ప్రత్యేకంగా నివేదనలు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: