ఆషాడ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ లో బోనాల జాతర స్టార్ట్ అవుతుంది.ఆషాడం మొదలయ్యాక గోల్కొండలో మొదటి బోనం ఎత్తుతారు. జగదాంబిక, మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు.. అయితే ఆషాడ మాసం వచ్చిందంటే చాలు కేవలం బోనాలు మాత్రమే కాదు కొన్ని పద్ధతులు, సాంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉంటాయి. ఆషాడ మాసంలో చాలామంది హిందువులు కొన్ని ప్రత్యేకమైన సాంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాడ మాసాన్ని పండుగలకు అనువుగాని మాసంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ఆషాడ మాసంలో శుభకార్యాలు చేసుకోరు. గృహప్రవేశాలు వివాహాలు, వంటి వాటిని పక్కన పెడతారు. 

శుభకార్యాలు ఈ నెలలో అస్సలే జరుపుకోరు. దీన్ని శూన్య మాసంగా పరిగణించడం వల్ల ఆషాడ మాసంలో ఇలాంటివి చేయకూడదు అని హిందూ ధర్మ పెద్దలు చెబుతున్నారు. అలాగే ఈ ఆషాడ శుద్ధి ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే ఆషాడం శుభకార్యాలకి అనువు కాదని శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు ఆషాడమాసంలో ఎవరికి అందవు కాబట్టి అందుకే ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని అంటారు. అలాగే కొత్తగా పెళ్లైన నవ దంపతులు ఈ ఆషాడ మాసంలో దూరంగా ఉండాలని అంటారు.

సైంటిఫిక్ గా కూడా ఈ ఆషాడ మాసంలో దంపతులను దూరంగా ఉండమంటారు. ఎందుకంటే కొత్తగా పెళ్లైన వారు ఈ ఆషాడ మాసంలో ఒక దగ్గరే ఉంటే నెల తప్పితే పుట్టే బిడ్డ ఎండాకాలంలో పుడుతుంది. అందుకే ఈ మాసంలో నవ దంపతులు ఒక దగ్గర ఉండకూడదని అంటారు. ఇక ఆషాడ మాసం వచ్చిందంటే చాలామంది గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ని రోజులు ఒంట్లో ఉన్న వేడి పోతుంది.. ఆషాడ మాసంలో ఎంత పెద్ద పనులు ఉన్నా శుభకార్యాలు ఉన్నా సరే వాయిదా వేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: