• 2010 ఆసియాకప్ సంఘటన వివరించిన అక్తర్

 

పాక్ పై సిక్స్ కొట్టి గెలిపించిన హర్భజన్

 

• ఆ మ్యాచ్ లో భజ్జీ తనతో గొడవపడ్డాడని అక్తర్ వెల్లడి

 

• హోటల్ రూమ్ కెళ్లి భజ్జీని కొట్టాలనుకున్నానని వ్యాఖ్యలు 

 

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామూలుగానే మైదానంలో దూకుడుగా ఉంటే అది భజ్జి... అదే పాకిస్థాన్తో మ్యాచ్  అయితే... హోరాహోరీ పోరులో హర్భజన్  మరింత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అంటే చాలు... హర్భజన్ అగ్గిమీద గుగ్గిలం రగిలిపోతాడు . 

 

 

 అయితే 2010 ఆసియా కప్లో హర్భజన్ సింగ్ వ్యవహరించిన తీరు గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా హర్భజన్ ని రూం కి వెళ్లి కొట్టాలి అన్నంత కోపం వచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే 2010  శ్రీలంకలో జరిగిన ఆసియా కప్లో భారత్ పాక్ మధ్య ఎంతో ఉత్కంఠగా హోరాహోరి పోరు జరిగింది అన్న విషయం తెలిసిందే. హర్భజన్ పాకిస్థాన్ జట్టుపై తన ఆధిక్యాన్ని సాధించింది చివర్లో సిక్స్  కొట్టి భారత్ విజయం వరించేలా చేసాడు . అయితే ఆ మ్యాచ్లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ లో బజ్జి ఓ భారీ సిక్స్ కొట్టాడు. 

 

 

 

 తన బౌలింగ్లో హర్భజన్ సింగ్ భారీ సిక్స్ కొట్టడంతో రగిలిపోయిన పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్... హర్భజన్ సింగ్ శరీరాన్ని టార్గెట్ చేస్తూ  బౌన్సర్లు విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ కూడా మొదలైపోయింది. మామూలుగానే బజ్జి దూకుడు స్వభావం గలవాడు. ఇక గొడవ అయిందంటే ఇంకెలా ఉంటుంది. బజ్జి మాటలతో షోయబ్ అక్తర్ కోపం కాస్త నషాళానికి అంటింది. దీంతో హర్భజన్ ను ఏకంగా హోటల్ రూం కి వెళ్లి కొట్టాలి అనేంత  కోపం వచ్చింది అని చెప్పుకొచ్చాడు అక్తర్ .కానీ  తర్వాత రోజు హర్భజన్ సింగ్ వచ్చి  సారీ చెప్పే సరికి తన కోపం కాస్త చల్లారింది  అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హర్భజన్ సింగ్ తమతోనే తింటూ తమతో స్నేహంగా వుంటూ మ్యాచ్ విషయానికి వచ్చేసరికి మాతోనే గొడవ పడతాడు అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి: