ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్  కూడా హోరాహోరీగా జరుగుతున్న విషయం తెలిసింది.. ఇక నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఐపీఎల్ సీజన్ లో పడుతూ లేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ రెండు జట్ల లో ఏది విజయం సాధిస్తుంది అని ప్రేక్షకుల్లో  ఎంతో ఉత్కంఠగా మారింది. కాగా నిన్న ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును చిత్తుగా ఓడించింది. 20 పరుగుల తేడాతో  ఘన విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఈ మ్యాచ్లో సన్ రైజర్ ఆటగాడు విలియమ్సన్ ఆఫ్ సెంచరీ సాధించినప్పటికి కూడా విజయం  మాత్రం సాధించలేకపోయింది.



  ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రేక్షకుల అందరినీ ఆశ్చర్యపరిచే ఎన్నో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. 19వ ఓవర్ ను  మహేంద్రసింగ్ ధోని బౌలింగ్ చేసేందుకు శార్దూల్ ఠాగూర్కు బంతిని అప్పగించాడు. ఈ క్రమంలోనే 11 బంతుల్లో  సన్రైజర్స్ విజయం సాధించడానికి 25 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే బౌలర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ మెన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి బంతిని వికెట్లకు దూరంగా యార్కర్ వేసే ప్రయత్నం చేశాడు. ఇక అది కాస్తా టైమ్ లైన్  అవతల ఫుల్ టాస్ పడింది. ఇక రషీద్ ఖాన్ ఆ బంతిని ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ అతని బ్యాట్ కి  మాత్రం బంతి అంద లేదు. దీంతో ధోనీ చేతుల్లో పడిపోయింది ఆ బంతి. ఇక ఈ క్రమంలోనే ఎంపైర్ రెండవసారి వైడ్ ఇవ్వబోయాడు ఎంపైర్... ధోనీ శార్దూల్ ఠాకూర్ అదెలా వైడ్  అవుతుంది అన్నట్లుగా స్పందించారు. ధోని అయితే చేతులు చాపుతూ బంతిని పడిన ప్రదేశాన్ని చూపిస్తూ ఎంపైర్ వైపు సీరియస్ గా చూశాడు. దీంతో వైడ్  ఇవ్వడానికి  కొద్దిమేర చేతులెత్తిన ఎంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకుని వైడ్  ఇవ్వలేదు. ఈ మ్యాచ్ లో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: