టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం బారిన పడడంతో ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టు ఎంపిక కాలేదు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బీసీసీఐ  పై విమర్శలు రావడంతో ఎట్టకేలకు బిసిసిఐ టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మను ఎంపిక చేసింది.  బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకున్న రోహిత్ శర్మ..  టెస్ట్ సిరీస్లో భారత జట్టు లో చేరేందుకు రెండు వారాల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళాడు. అయితే కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య 14 రోజులపాటు క్వారంటైన్ పూర్తిచేసుకున్నాడు రోహిత్ శర్మ.


 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా ఆడబోయే మూడవ టెస్ట్ మ్యాచ్లో జట్టుతో కలవనున్నాడు. ఇటీవలే మెల్బోర్న్ లో ఉన్న టీమిండియా జట్టుతో కలిశాడు రోహిత్ శర్మ.  దీనికి సంబంధించిన వీడియోను ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ బస చేస్తున్న హోటల్కు వెళ్లి రోహిత్ శర్మ సహచరులని పలకరించాడు.  రోహిత్ శర్మ రావడంతో సహచరుడు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.


 ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వచ్చి రోహిత్ శర్మను కలిశారు అందరు కలిసిన తర్వాత రోహిత్ శర్మ దగ్గరికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి రోహిత్ శర్మను పలకరించాడు. ఇక తనదైన శైలిలో రోహిత్ శర్మ పై సెటైర్ వేసాడు రవిశాస్త్రి.  క్వారంటైన్ ఎలా గడిచింది మై ఫ్రెండ్.. మీ వయసు బాగా తగ్గినట్లు కనిపిస్తుంది అంటూ సెటైర్ వేశాడు.. దీంతో రోహిత్ శర్మ రవి శాస్త్రి సెంటర్కు చిరునవ్వు చిందించాడు. అయితే ఐపీఎల్ లో రోహిత్ శర్మ అధిక బరువు పెరిగాడు అని  ఎంతగానో ట్రోల్స్ వచ్చాయి అనే విషయం తెలిసిందే.  ఇకపోతే జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా జరగబోయే మూడవ టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ ని ఆడించాలని పెద్ద ఎత్తున డిమాండ్ కూడా వస్తుంది. ఇక రోహిత్ శర్మ జట్టులోకి చేరిన తర్వాత భారత జట్టు ఎలా రాణిస్తోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: