కాన్‌బెర్రా: మొన్నటివరకు మూడో టెస్టు ఎక్కడ జరుగుతుందో తెలియక అభిమానులు తికమక పడ్డారు. ఎలాగోలా ఆ టెస్టు సిడ్నీలోనే ఉంటుందని తేలింది. అయితే ఇప్పుడు మరో భయం పట్టుకుంది. బ్రిస్బేన్‌లో జరగాల్సిన నాలుగో టెస్ట్ అసలు జరుగుతుందా.. లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల న్యూ సౌత్ వేల్స్‌లో కరోనా కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. దీంతో న్యూసౌత్ వేల్స్ నుంచి క్వీన్స్‌ల్యాండ్ రాకపోకలను నిలిపివేసింది. సరిహద్దులను మూసివేసింది. అయితే ఇదే న్యూ సౌత్ వేల్స్ రాజధాని సిడ్నీలో ఆసిస్-ఇండియా మూడో టెస్ట్ జరుగుతోంది.

ఇక నాలుగో టెస్ట్ క్వీన్స్‌ల్యాండ్ రాజధాని బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉంది. అయితే సరిహ్దదులనే మూసివేసిన తరుణంలో ఆటగాళ్లను అనుమతిస్తారా..? లేదా..? అనే అనుమానాలు తలెత్తాయి. అయితే టీమిండియా ఆటగాళ్లను అనుమతిస్తామని క్వీన్స్‌ల్యాండ్ ప్రకటించింది. దీంతో టెస్టు మ్యాచ్ నిర్వహణకు అడ్డంకులు తీరిపోయాయని అంతా భావించారు. అయితే ఇక్కడ క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ఓ షరతు పెట్టింది. కచ్చితమైన కరోనా క్వారంటైన్ నిబంధనలను పాటించిన ఆటగాళ్లను మాత్రమే అనుమతిస్తామని చెప్పింది. దీంతో ఖంగు తిన్ని టీమిండియా.. తమకోసం కరోనా నిబంధనలను కొద్దిగా సడలించాలని కోరింది.

టీమిండియా అభ్యర్థనపై క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్య శాఖ మంత్రి రాస్ బేట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ట్విటర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘నచ్చకపోతే ఇక్కడకు వచ్చి ఆడకండి. అంతేకానీ కరోనా నిబంధనలను మాత్రం సులభం చేసేది లేదు. నిబంధనలను పాటిచలేకపోతే ఇక్కడకు రాకండి. నిబంధనలకు అనుగుణంగా ఆడేందుకు ఇష్టపడితేనే రండి. లేకుంటే అవసరం లేదు’ అంటూ ఆ వీడియోలో ఘాటుగా స్పందించారు.

ఇదిలా ఉంటే ఇటీవలే న్యూ ఇయర్ రోజున టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్ తదితర ఆటగాళ్లు ఓ అవుట్ డోర్ హోటల్లో భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. దీంతో బయో సెక్యూర్ బబుల్ నిబంధనలను వారు ఉల్లంఘించారంటూ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌కు తరలించింది క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో బ్రిస్బేన్‌లో జరగనున్న నాలుగో టెస్టుకు వీరిని అనుమతిస్తారా..? లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై టీమిండియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: