రవీంద్ర జడేజా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కూడా దూసుకుపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఆల్రౌండర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా అందరిని  ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు . బౌలింగ్ ఫీల్డింగ్ బ్యాటింగ్ అనే తేడా లేకుండా అన్ని విభాగాల్లో కూడా ఆదరగోడుతూ  ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు.  ఒకప్పుడు కూడా బ్యాటింగ్ లో రవీంద్ర జడేజా అదరగొట్టినప్పటికీ కేవలం కొన్ని కొన్ని సార్లు మాత్రమే రవీంద్ర జడేజా బ్యాటింగ్ చూసే అవకాశం వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ సార్లు రవీంద్ర జడేజా బ్యాటింగ్ కిందికి కీలక సమయంలో స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుండటం  చూసి ప్రేక్షకులు సైతం ఆశ్చర్య పోతున్నారు.




 ఇక ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కూడా రవీంద్ర జడేజా దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి. సాధారణంగా రవీంద్ర జడేజా మైదానంలో ఎంతో చురుకుగా కదులుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మైదానంలో ఫీల్డింగ్ విషయంలోనే కాదు..  వికెట్ల మధ్య రన్స్  తీయడంలో కూడా రవీంద్ర జడేజాకు మంచి రికార్డు ఉంది. ఇక రవీంద్ర జడేజా తో పాటు ఇతర బ్యాట్స్మెన్లు ఎవరైనా ఉన్నారు అంటే ఇక పరుగులు తీయడం లో ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  కొన్ని కొన్ని సార్లు ఇలా పరుగులు తీస్తూ రనౌట్ అయిన ఘటనలు కూడా ఎన్నో తెరమీదికి వస్తూ ఉంటాయి.



 ముఖ్యంగా టెస్టు క్రికెట్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇతర బ్యాట్ మెన్స్ అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా లేకపోతే రన్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది అంటూ సూచిస్తున్నారు. సిడ్నీ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ జస్ప్రిత్ బూమ్రా రనౌట్ అయిన సమయంలో నాన్  స్ట్రైక్ లో రవీంద్ర జడేజా ఉండడం గమనార్హం. ఇప్పటివరకు రవీంద్ర జడేజా ఆడిన 73 టెస్ట్ ఇన్నింగ్స్ లో ఇరవై  సార్లు రనౌట్ జరగగా.. 13 సార్లు వేరే ఆటగాడు రనౌట్ అయితే ఏడు సార్లు రవీంద్ర జడేజా పెవిలియన్ చేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: