అయితే 1983 తర్వాత ఇక వరల్డ్ కప్ భారత జట్టుకు అందని ద్రాక్షలా గా మారిపోయింది అని చెప్పాలి. పదేళ్లు గడిచిపోయాయి ఇంకా వరల్డ్ కప్ త
గెలుచుకుకోలేక పోయింది భారత్. ఇక దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది.సరిగ్గా ఇదే రోజున 2011 సంవత్సరంలో భారత జట్టు రెండవసారి వరల్డ్ కప్ ను ముద్దాడింది భారత జట్టు. క్రికెట్ ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దీంతో అటు భారత క్రికెట్ ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సరిగ్గా 2011 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన శ్రీలంక భారత్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగగా.. టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది.
1983 తర్వాత అందని ద్రాక్షల మారిన వరల్డ్ కప్ 2011 ఏప్రిల్ రెండవ తేదీన భారత జట్టు దక్కించుచుకుంది. ధోనీ మ్యాచ్ విన్నింగ్ షాట్ కొట్టగానే ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ అంటూ అప్పటి కామెంటేటర్ రవిశాస్త్రి మాట్లాడిన మాటలు కూడా ప్రేక్షకుల చెవిలో ధ్వనిస్తూనే ఉన్నాయ్. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇక వరల్డ్ కప్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక 2011 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ లో గౌతం గంభీర్ 97.. మహేంద్రసింగ్ ధోని 91 చేసిన వీరోచిత పోరాటాన్ని ఇప్పటికి కూడా అటు క్రికెట్ ప్రేక్షకులు మరువలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి