అయితే తమ దేశ క్రికెటర్లకు వీసా మంజూరు చేసే విషయంలో భారత్ హామీ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎహసాన్ మనీ కొంతకాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ని కోరుతున్నారు. దీనితో ఇటీవల ఐసీసీ బీసీసీఐ తో సమావేశమై వీసా మంజూరు విషయంపై చర్చించింది. కాగా, ఈ సమావేశంలో పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేసే విషయంలో భారత ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని బీసీసీఐ కార్యదర్శి జే షా ఐసీసీ అపెక్స్ కౌన్సిల్ కి వెల్లడించారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ ఆటగాళ్లకు భారత ప్రభుత్వం తీపి కబురు అందించినట్లు అయింది.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు జట్లు చాలా సంవత్సరాలుగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదు. కానీ ఈసారి జరుగనున్న టీ20 వరల్డ్ కప్ సిరీస్ లో భారత్ ఇండియా తలపడనున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడనుండగా.. క్రికెట్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు ఆద్యంతం ఆసక్తికరంగా జరుగుతాయి. ఇకపోతే ఐసీసీ ట్వంటీ 20 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం జరగనుండగా.. మిగతా మ్యాచ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, ధర్మశాల స్టేడియాలలో జరగనున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి