భారతీయ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు మహేంద్ర సింగ్ ధోని. 2004 లో ఇండియన్ క్రికెట్ టీం లో చోటు సంపాదించిన ధోని, తనదైన ఆట తీరుతో తోటి ఆటగాళ్లను, సెలెక్టర్లను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ధోని క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఎంతటి బౌలర్ నైనా అలవోకగా సిక్సర్ కొట్టగల అసాధారణ ప్రతిభ ధోని సొంతం. ఇండియా క్రికెట్ టీం ను ఎంతలా డెవలప్ చేశాడంటే ధోనికి ముందు ధోనికి తరువాత అని చెప్పుకునేలా తయారు చేశాడు. ఇతని కెప్టెన్సీ లో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అపారమైన అనుభవాన్ని సంపాదించుకున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నమ్మకాన్ని కోల్పోకుండా జట్టు కోసం ఎలా ఆడాలో నేర్చుకున్నారు. ఇప్పటి వరకు ఏ ఇండియన్ కెప్టెన్ సాధించని ఎన్నో రికార్డులను సాధించి పెట్టాడు. అందులో 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చాలా ప్రత్యేకమైనది. ఈ వరల్డ్ కప్ ను క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండూల్కర్ కు అంకితమిచ్చారు జట్టు సభ్యులు.ధోని ఇండియన్ క్రికెట్ అభివృద్ధి చేసిన సేవలకు గానూ కొన్ని అవార్డులు అతనికి సొంతం అయ్యాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
  * 2008 మరియు 2009 సంవత్సరాలకు గానూ ధోనిని ఉత్తమ ఐసీసీ వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఎన్నిక చేశారు.

* 2006, 2008, 2009, 2010, 2011, 2012, 2013 మరియు 2014 సంవత్సరాలకు ఐసీసీ వరల్డ్ వన్ డే ఇంటర్నేషనల్ టీం లో చోటు దక్కించుకోగా, అందులో 2009, 2011 మరియు 2014 సంవత్సరాలలో ఎంపిక చేసిన వన్ డే ఇంటర్నేషనల్ టీం లకు కెప్టెన్ గా గౌరవించబడ్డాడు.

* 2009, 2010 మరియు 2013 సంవత్సరాలకు గానూ ఐసీసీ వరల్డ్ టెట్ టీం లో చోటు సంపాదించాడు.

* 2013 సంవత్సరంలో ఎల్జీ పీపుల్స్ ఛాయస్ అవార్డును అందుకున్నాడు.

* 2009 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన అవార్డు అని తెలిసిన విషయమే.

* 2007 -2008 క్రీడా సంవత్సరానికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును దక్కించుకున్నాడు.

* 2018 లో పద్మభూషణ్ అవార్డును దక్కించుకుని భారతదేశంలో ఎనలేని గౌరవ మర్యాదలను పొందాడు.

ఇలా ధోని క్రికెట్ చరిత్రలో ఏ క్రీడాకారుడు సాధించని విజయాలను మరియు పురస్కారాలను పొంది భావి తరాల వారికి ఒక స్ఫూర్తిగా నిలిచాడు. ఈ రోజు ధోని తన 40 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాము. హ్యాపీ బర్త్ డే ధోని సార్.


మరింత సమాచారం తెలుసుకోండి: