ప్రపంచ దృష్టిని మొత్తం ఆకర్షించే మెగా క్రీడా ప్రపంచం ఒలింపిక్స్ లో పతకం సాధించాలని ప్రతి ఒక్క క్రీడాకారునికి కలగా ఉంటుంది. దీని కోసం ఎంతో మంది క్రీడాకారులు ఎన్నో ఏళ్ల నుంచి శ్రమిస్తూ ఉంటారు. అప్పటి వరకు వివిధ టోర్నీలో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఒలింపిక్స్ లో పతకం సాధించడం మాత్రం కలగా పెట్టుకుంటూ ఉంటారు క్రీడాకారులు. ఈ క్రమంలోనే ఒక్క సారిగా ఒలంపిక్స్ లో అవకాశం వచ్చింది అంటే ఒత్తిడి మొత్తం చిత్తు చేస్తూ తమ ప్రతిభను ప్రపంచానికి చూపిస్తా బంగారు పతకాన్ని గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఇటీవలే ప్రారంభమైన టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా ఎంతో మంది క్రీడాకారులు సత్తా చాటుతున్నారు.



 ఎన్నో ఏళ్ల నుంచి టోక్యో ఒలింపిక్స్ లో పథకం సాధించాలని అనుకున్నప్పటికీ నిరాశ పడుతున్న క్రీడాకారులు ఇక ఈ సారి అద్భుత ప్రతిభను చాటి పథకం సాధిస్తున్నారు. మరి కొంతమంది ఇక మొదటిసారి టోక్యో ఒలంపిక్స్ లో అడుగుపెట్టినప్పటికీ ఎలాంటి ఒత్తిడి లేకుండా సీనియర్లను సైతం చిత్తు చేస్తూ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంటున్నారు. ఇటీవలే ఏకంగా మహిళా స్కేట్ బోర్డింగ్ లో ఏకంగా 13 ఏళ్ల ఇద్దరు చిన్నారులు ఒకరు బంగారు పతకాన్ని ఒకరు రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఒక పద్దెనిమిదేళ్ళ కుర్రాడు ఒలంపిక్ లో సరికొత్త చరిత్ర సృష్టించాడు.



 అప్పటివరకు ఇక దిగ్గజ క్రీడాకారులుగా కొనసాగుతున్న సీనియర్స్ ని సైతం వెనక్కి నెట్టి అరుదైన రికార్డును సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ లో ఆఫ్రికాలోని చిన్న దేశమైన ట్యూనిసియా కి చెందిన 18 ఏళ్ల కుర్రాడు 400 మీటర్ల ఫ్రీ స్టైల్ లో అదరగొట్టి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే ఈ నాలుగు వందల మీటర్ల ఫ్రీస్టైల్ పోటీలో ఎంతో అనుభవం ఉన్న సీనియర్ స్విమ్మర్లు కూడా ఉన్నారు. కానీ వారందరినీ వెనక్కి నెట్టి కేవలం 3 నిమిషాల 43.26 సెకన్లలో సరికొత్త రికార్డ్ సృష్టించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ కుర్రాడి దెబ్బకు అప్పటివరకు సీనియర్ గా ఉన్న ఇద్దరు ఆటగాళ్ళు రజత, కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: