అంతేకాదు ప్రస్తుతం సానియామీర్జా పాకిస్థాన్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా ను తొలగించాలి అంటూ ఎన్నో డిమాండ్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ అటు ప్రభుత్వం మాత్రం సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తూ వచ్చింది. అంతే కాకుండా ఇక తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు పొందిన క్రీడాకారులు కూడా ఎవరూ లేకపోవడం గమనార్హం. కానీ ఇటీవలి కాలంలో తెలుగు తేజం పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెడుతూ వరుసగా రెండు ఒలంపిక్స్ లో పతకాలను సాధించింది.
అంతేకాదు తెలుగు ప్రజలందరి గౌరవాన్ని నిలబెట్టింది పీవీ సింధు. ఈ క్రమంలోనే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ని మార్చాలి అని డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. ఇటీవలే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాను మార్చాలి అంటూ విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్ కోడల్ని బ్రాండ్ అంబాసిడర్ గా తప్పించి భారత్కు రెండు సార్లు పథకం అందించి తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన పీవీ సింధు ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి అంటూ కోరారు. అయితే వరుసగా రెండు ఒలంపిక్స్ లో తెలుగు తేజం పీవీ సింధు పతకాలు సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ డిమాండ్ మరింత ఎక్కువ అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి