ఈరోజు షార్జా క్రికెట్ మైదానం వేదికగా ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 లో న్యూజిలాండ్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ బ్యాటర్ లను కట్టడి చేసింది. అయితే న్యూజిలాండ్ ఓపెనర్ లో అయినా మార్టిన్ గప్టిల్ 20 బంతుల్లో కేవలం 17 పరుగులు చేయగా డారిల్ మిచెల్ 20 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ 26 బంతుల్లో 25 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అలాగే జేమ్స్ నీషమ్ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేయగా డెవాన్ కాన్వే 24 బంతుల్లో 23 పరుగులు చేసి వెనుదిరిగాడు. గ్లెన్ ఫిలిప్స్ 15 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేస్తే వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ 8 బంతుల్లో 8 పరుగులు చేశాడు. అలాగే మిచెల్ సాంట్నర్ 5 బంతుల్లో 6 పరుగులు చేస్తే ఇష్ సోధి 2 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసాడు. దాంతో న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో కేవలం 134 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లను కోల్పోయింది.

ఇక పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు తీయగా.... షాహీన్ అఫ్రిది, ఇమాద్ వాసిమ్, మహ్మద్ హఫీజ్, ఒక్కో వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 135 పరుగులు చేయాలి. అయితే న్యూజిలాండ్ బౌలర్ల ను  ఎదుర్కొని... బౌలింగ్ కు బాగా సహకరించే ఈ షార్జా  పిచ్పై 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలదు లేదా అనేది చూడాలి. అయితే ఇందులో గెలిస్తే పాక్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: