అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం రావాలే గానీ అదరగొట్టి తమ సత్తా ఏంటో చూపించాలి అని యువ ఆటగాళ్లు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం టీమిండియా లో ఎంతో మంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇక న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ల వికెట్లు తీయడానికి అటు టీమిండియా బౌలర్లు సర్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పాలి.


 ఇక ఎంతో నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు న్యూజిలాండ్ జట్టుకు విల్ యంగ్ రూపంలో వికెట్ కోల్పోయింది. అయితే ఇక వికెట్ కోల్పోవడానికి వృద్ధిమాన్ సాహా స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ భరత్ కారణం అని చెప్పాలి. ఎంతో అద్భుతంగా క్యాచ్  పట్టాడుయువ వికెట్ కీపర్. ఇన్నింగ్స్ లో భాగంగా 66 ఓవర్ వేసాడు రవిచంద్రన్ అశ్విన్. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేస్తున్న విల్ యంగ్ బ్యాట్ కి తాకి బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఎంతో కాన్ఫిడెంట్ గా అప్పీల్ చేశాడు కెఎస్ భరత్.


 అంతలోనే  రివ్యూ తీసుకున్నాడు. ఎంతో పట్టుబట్టి మరీ కెప్టెన్ రహానే ని ఒప్పించి రివ్యూ కి వెళ్ళాడు. రివ్యూ లో భాగంగా బంతి బ్యాట్ కి తగినట్లుగా స్పష్టంగా తెలిసింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఔట్  గా ప్రకటించాడు. దీంతో ఎట్టకేలకు న్యూజిలాండ్ ఒక వికెట్ కోల్పోయింది. టీమ్ ఇండియా జట్టు కు  చాలా సమయం తర్వాత ఒక వికెట్ దక్కడంతో ఇక ఆనందం నెలకొంది. అయితే వృద్ధిమాన్ సాహా మెడ నొప్పి కారణంగా జట్టు దూరమవడంతో అతని స్థానంలో వచ్చిన యువ ఆటగాడు  భరత్ మొదటి మ్యాచ్లోనే అద్భుతంగా రాణించి క్యాచ్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: