ఒక సాదాసీదా క్రికెటర్గా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ తక్కువ సమయంలోనే ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్  స్థాయికి ఎదిగాడు. తనదైన ఆటతీరుతో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఏకంగా టీమ్ ఇండియా జట్టు కెప్టెన్గా కూడా అవకాశం దక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇలా ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్గా కూడా దాదాపు దశాబ్ద కాలానికి పైగా భారత క్రికెట్లో ఎంతగానో సేవలందించాడు. అయితే ఇటీవలే భారత జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్ విరాట్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించాడు..


 పదేళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్లో విరాట్ కోహ్లీ ఒక ఆటగాడిగా ఎంతో అద్భుతంగా పరిణితి చెందాడు అంటూ రాహుల్ ద్రావిడ్ వ్యాఖ్యానించారు. సుదీర్ఘ ఫార్మాట్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏకంగా కెప్టెన్ స్థాయికి ఎదగడం ఎంతో గర్వించదగ్గ విషయం అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ ద్రావిడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే 2011లో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడని.. ఆ సమయంలో తాను కూడా టెస్ట్ క్రికెట్లో కొనసాగుతున్నాను అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీతో కలిసి కొన్ని మ్యాచులు కూడా ఆడాను అంటూ గుర్తు చేసుకున్నాడు.


 అయితే ఇక టెస్టు ఫార్మాట్లో విరాట్ కోహ్లీ పదేళ్లు పూర్తి చేసుకున్నాడు అని ఈ పదేళ్ల సమయంలో కోహ్లీ ఆటగాడిగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా ఎదిగాడు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏకంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు అంటూ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఆటలో పర్ఫెక్షన్ కోసం.. ఆటగాళ్ల ఫిట్నెస్ కోసం విరాట్ కోహ్లీ ఎంతగానో కష్ట పడుతూ ఉంటాడు అంటూ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. కాగా 2011లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ లో 15 పరుగులు రెండో ఇన్నింగ్స్ లో  నాలుగు పరుగులు చేశాడు. అయితే రెండు ఇన్నింగ్స్ లలో కూడా రాహుల్ ద్రవిడ్ తో కలిసి బ్యాటింగ్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: