టీం ఇండియాలో ప్రస్తుతం సీనియర్ క్రికెటర్లు కొంత మందికి గడ్డు కాలం నడుస్తోంది అని చెప్పాలి. అంటే కొందరు టీం లో ఉన్నా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి కొందరు ఫామ్ లో లేక జట్టు నుండి తొలంగించబడి ఉన్నారు. వారిలో మనము మొదట చెప్పుకోవలసింది గబ్బర్ శిఖర్ ధావన్ గురించి, ఎందుకంటే శిఖర్ ధావన్ కెరీర్ అంతా కూడా ఒడిదుడుకులుగా సాగింది. ఇతను ఓపెనింగ్ స్థానం తప్పితే వేరే ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం వీలు కాదు కాబట్టి, చాలా సార్లు జట్టు నుండి తొలగిచబడ్డాడు, మళ్ళీ కొంత కాలానికి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా సీనియర్ టీం నుండి తొలగించబడ్డాడు.

అంతే కాకుండా ఎంతో ముఖ్యమైన టీ 20 వరల్డ్ కప్ 2021 కు ఎంపిక కావడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకు కారణం ఫామ్ లో లేకపోవడమే. అయితే తన సత్తాను నిరూపించుకోవడం కోసం వరల్డ్ కప్ కు ముందు జూనియర్ టీం కు కెప్టెన్ గా నియమించి శ్రీలంక పర్యటనకు పంపింది బీసీసీఐ. కానీ అక్కడ కూడా ఆటగాళ్ల నుండి మెరుగైన ఆటతీరును రాబట్టుకోవడంలోనూ మరియు ఆటగాడిగానూ సక్సెస్ కాలేకపోయాడు. ఇలా వివిధ కారణాలతో పూర్తిగా సీనియర్ జట్టు నుండి పక్కన పెట్టడం జరిగింది.

అయితే కొత్త సంవత్సరం కలిసి వచ్చిందో ఏమో తెలియదు కానీ, నిన్న సౌత్ ఆఫ్రికాతో ఆడాల్సిన మూడు వన్ డే ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్ కు చోటు దక్కింది. అయితే ఈ సిరీస్ లో కనుక తనకు అవకాశం వచ్చి మెరుగ్గా రాణించకపోతే తన కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని క్రికెట్ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. కాబట్టి ఈ సిరీస్ ధావన్ కు ప్రాణవాయువు లాంటిది, మరి ఏ విధంగా వాడుకుంటాడో అన్నది తెలియాలంటే ఇంకా మూడు వారాలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: