సౌతాఫ్రికాలో సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో టీమిండియా అద్భుతంగా రాణించడంతో భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే టీమిండియా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్న వేళ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ల ఫామ్ మాత్రం కలవరపెడుతోంది. ఇద్దరికీ సెలెక్టర్లు ఎన్ని సార్లు అవకాశం కల్పించిన వారు మాత్రం తమని తాము నిరూపించుకో లేకపోతున్నారు. ప్రతి మ్యాచ్ లో పేలవ ప్రదర్శన చేస్తూ నిరాశ పరుస్తూనే ఉన్నారు. ఇలా ఇటీవల కాలంలో టీమిండియాలో ఫామ్ లో లేక తంటాలు పడుతున్నారు సీనియర్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా అజింక్యా రహానే లు.
వీరిద్దరూ టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించారు. మరి ఇప్పుడు ఆ టెస్టులోనే రాణించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిపై ఫామ్ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వీరిద్దరూ మరోసారి విఫలమైన నేపథ్యంలో దొరికిన అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అని విచారం వ్యక్తం చేశాడు సునీల్ గవాస్కర్. ఇకపై వీళ్లు టీమిండియాలో కొనసాగాలి అంటే రెండు ఇన్నింగ్స్ లో బాగా ఆడటం ఒకటే వీరికి మిగిలివున్న చాన్స్ లేదంటే ఇక టీమిండియా నుంచి పక్కన పెట్టేస్తారు అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి