ప్రపంచ వ్యాప్తంగా అదరణలో ఉన్న కొన్ని ఆటలలో టెన్నిస్ కూడా ఒకటి. ఈ ఆటకు అన్ని దేశాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లే ఇండియా నుండి కూడా పురుషులు మరియు మహిళల వైపు నుండి టెన్నిస్ చరిత్రలో ఎందరో అనేక రికార్డులను సాధించారు. అదే విధంగా ఇండియా నుండి అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది సానియా మీర్జా. 2001 నుండి టెన్నిస్ లో మెళకువలు నేర్చుకుంటూ , ఇండియా గర్వించ దగ్గ స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో సానియా మీర్జా ఎన్నో అవార్డు లను అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానుల మనసును గెలుచు కున్న సానియా మీర్జా గత కొంత కాలంగా టెన్నిస్ లో వెనుక బడుతూ వస్తోంది. 

బహుశా వయసు మీద పడుతుండడం, పెళ్లి అయి పిల్లలు కలగడంతో టెన్నిస్ లో ఉత్తమ ప్రదర్శన కనబరచలేకపోతోంది. అందుకే ఇక టెన్నిస్ నుండి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుదు సానియా మీర్జా షోయబ్ మాలిక్ కు భార్య కావడం చేత పాకిస్తాన్ లోని అభిమానులు సైతం దుఃఖించే వార్త ఇది అని చెప్పాలి. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 లో ఓటమి చెందడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని తర్వాత జరగ నున్న యూఎస్ ఓపెన్ లో ఆడాలని అనిపించినా, ఆరోగ్యం ఫిట్నెస్ సహకరిస్తుంది అని నమ్మకం లేదు.

ఇలా పలు కారణాల వలనే టెన్నిస్ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది సానియా మీర్జా. మరి దీని తర్వాత సానియా మీర్జా కెరీర్ గురించి ఏ విధమైన కార్యచరణ చేయనుంది అనేది తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇండియాలో టెన్నిస్ అకాడమీ పెడుతుందా ? లేదా ఇక పూర్తిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ పాకిస్తాన్ కే పరిమితం అవుతుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: