ఇటీవలే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని బిసిసిఐ మరోసారి అవమానించి నట్టు తెలుస్తోంది.. ఎందుకంటే విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమైన 100 వ టెస్ట్ మ్యాచ్ తనకు ఎంతో అనుబంధం ఉన్న బెంగళూరు నగరంలో ఆడాలని ఆశ పడ్డాను. ఈ క్రమంలోనే గతంలో బీసీసీఐ అధ్యక్షుడు కూడా కోహ్లీకి ప్రత్యేకమైన 100వ టెస్ట్ మ్యాచ్ బెంగళూరు వేదికగా నిర్వహించి షెడ్యూల్లో మార్పులు చేస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం బిసిసీఐ ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది అని అర్థమవుతుంది.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే బిసిసీఐ మొదటి టెస్టు మొహాలీ లో నిర్వహించాలని నిర్ణయించింది. షెడ్యూల్ మార్పు విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభ్యర్థనను మన్నించిన బిసిసిఐ ముందుగా టి20 సిరీస్ కు అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైన చిరకాలం గుర్తుండిపోయే 100వ టెస్ట్ మ్యాచ్ విషయంలో మాత్రం మార్పు చేయకుండా యాదావీధిగా మొహాలీలో నిర్వహించేందుకు నిర్ణయించింది. దీంతో అటు విరాట్ కోహ్లీ కి ఊహించని షాక్ తగిలింది. అయితే బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే కోహ్లీని అవమానించినందుకు ఇలా వ్యవహరించింది అంటూ అంటూ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.
ప్రస్తుతం బిసిసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 24న లక్నోలో, రెండు, మూడో టీ20లు 26, 27 తేదీల్లో ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం తొలి టెస్ట్ మార్చి 3 నుంచి మొహాలీ వేదికగా, రెండో టెస్ట్ మార్చి 12 నుంచి బెంగళూరులో జరగనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి