మొన్నటికి మొన్న భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై రోహిత్ సేన పూర్తి ఆదిపత్యాన్ని సాధించింది. వన్డే టి20 సిరీస్ లో ఎక్కడా వెస్టిండీస్కు అవకాశం ఇవ్వకుండా.. క్లీన్ స్వీప్ చేసింది అనే విషయం తెలిసిందే. ఇదే జోరు అటు శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్ లో కూడా కొనసాగించాలని అనుకుంటుంది రోహిత్ సేనా. శ్రీలంకతో నేటి నుండి ప్రారంభం కాబోయే మొదటి టి20 మ్యాచ్ కి ముందు రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. టి20 సిరీస్ లో మరో 37 పరుగులు చేస్తే చాలు ఇక 20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హిట్ మాన్ రికార్డు సృష్టించబోతున్నాడు.
ప్రస్తుతం టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ 3263 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 3299 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3296 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.. ఈ క్రమంలోనే ఇక శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ మరో 37 పరుగులు చేస్తే చాలు టి20 లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించబోతు న్నాడు. అంతేకాదు ఇక శ్రీలంకతో జరిగే మొదటి టి20 మ్యాచ్ తో మరో రికార్డు కూడా బద్దలు కొట్ట బోతున్నాడు రోహిత్ శర్మ. 124 అంతర్జాతీయ టి20 మ్యాచ్ లు ఆడి అగ్రస్థానంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ ఉండగా 122 టి20 మ్యాచ్ లతో రెండవ స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి