ఐపీఎల్ మొదలైంది ఐపీఎల్ లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. కేవలం 131 పరుగులు మాత్రమే చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత దానిని కాపాడుకోలేక పోయింది. చివరికి ఐపీఎల్ మొదటి మ్యాచ్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది అని చెప్పాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది కానీ ధోని అభిమానులు మాత్రం సంతోషంలో మునిగిపోతున్నారు. అదేంటి బాసూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయిన తర్వాత అభిమానులు సంతోషంగా ఉండటం ఏమిటి.. అలా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నారు కదా. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడం గెలవడం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్ చూసి దాదాపు 2ఏళ్లు గడిచిపోతున్నాయి.


 ఇక 2019లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుపై  హాఫ్ సెంచరీ చేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐపీఎల్లో ధోనీ అద్భుతంగా రాణిస్తాడు అని అభిమానులు ఎదురు చూడటం తప్ప ఎక్కడ ధోని మంచి బ్యాటింగ్ చేసింది లేదు. కానీ చాలా రోజుల తర్వాత ఇటీవల జరిగిన ఐపీఎల్ 15 సీజన్ మొదటి మ్యాచ్లో ఏకంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మొదట్లో అందరిలాగానే ఎంతో నెమ్మదిగా ఆడినట్లు కనిపించిన మహేంద్రసింగ్ ధోని.. ఆ తర్వాత మాత్రం పుంజుకున్నాడు.


 అద్భుతంగా రాణిస్తూ ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయాడు మహేంద్రసింగ్ ధోని. దీంతో 38 బంతుల్లో 50 పరుగులు చేసి అటు చెన్నై సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరును చేసి పెట్టాడు. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోయారు. ఎన్నో రోజుల తర్వాత ధోని మంచి ఇన్నింగ్స్ చూసామని ఇక హాఫ్ సెంచరీ కూడా చేశాడని.. ఇంతకంటే ఇంకేం కావాలి అంటూ అభిమానులు అందరూ కూడా మురిసిపోతున్నారు. ఇక ఓటమి అంటారా ఈ ఒక్క మ్యాచ్ తోనే పోయేదేమీ లేదు.. తర్వాత మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ తప్పకుండా గెలిచి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl