అప్పుడు అతను మల్టీడైమన్షన్ ప్లేయర్ అంటూ అందరూ ప్రశంసలు వర్షం కురిపించారు. అతను జట్టులో ఉంటే ఎంతో ఉపయోగం ఉంటుంది అని అనుకునేవారు. అతనికి ఎక్కడ తిరుగులేదు అని భావించేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతన్ని జట్టులోకి ఎందుకు తీసుకున్నామా అని ప్రతి ఒక్కరు బాధ పడే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. ప్రస్తుతం చెత్త ఫామ్ లో కొనసాగుతూ జట్టు విజయావకాశాలను దెబ్బ తీస్తూ ఉన్నాడు సదరు ఆటగాడు. అతను ఎవరో కాదు విజయ్ శంకర్. ప్రస్తుతం గుజరాత్ టైటాన్  జట్టులో కొనసాగుతోన్న విజయ శంకర్ ఇటీవల నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. రెండు పరుగులు మాత్రమే చేసి చివరికి అనవసరమైన బంతిని షాట్ ఆడి చివరికి మూల్యం చెల్లించుకున్నాడూ.


 ఎన్నో ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నప్పటికీ తన బలహీనతను మాత్రం వదులుకోలేక పోతున్నాడు విజయ్ శంకర్. అదే రోడ్డ కొట్టుడు తో అభిమానులను ఆగ్రహానికి గురి అవుతున్నాడు. గత సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడాడు విజయ్ శంకర్. ఆ జట్టులో కూడా ఒరగబెట్టింది ఏమీ లేదు అని చెప్పాలి. దీంతో అతన్ని పట్టించుకోకుండా మెగా వేలంలోకి వదిలేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. చివరికి ఎవరు కొనుక్కొని పరిస్థితిలో అతని 40 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసింది గుజరాత్.


 ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ లు ఆడిన జయశంకర్ 4, 13 పరుగులతో మాత్రమే సరిపెట్టుకున్నాడు. అటు బౌలింగ్ లో కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు అని చెప్పాలి. అయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టులో మరోసారి అవకాశం వచ్చింది. ఇక ఈ సారి కూడా పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో అభిమానుల అతన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. జట్లు మారినా నీ మాట తీరు మాత్రం మారదు. అదే నిర్లక్ష్యం... వరుసగా విఫలమవుతున్న క్రికెటర్ కి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు  తీసిపారేయండి అంటూ సోషల్ మీడియాలోకామెంట్ చేస్తూ ఉన్నారు అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl