ఇటీవలే ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయాన్ని సాధించిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు మంచి జోరు మీద ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది లక్నో జట్టు. ఈ క్రమంలోనే కేవలం 165 పరుగులకు మాత్రమే ప్రత్యర్థి ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది. ఇది ఐపీఎల్ లో ఒక సాదా సీదా టార్గెట్ మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఇక వరుస ఓటములతో సతమతమౌతున్న ముంబై ఇండియన్స్ టార్గెట్ అతి తక్కువగా వుండడంతో ఈ సారి విజయం సాధించడం పక్క అని.. ఐపీఎల్లో బోణీ కొడుతుంది అని ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసింది.



 ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది ముంబై ఇండియన్స్ జట్టు. దీంతో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది లక్నో జట్టు. దీంతో విజయానందంలో ఉంది. ఇలాంటి సమయంలోనే అటు లక్నో సూపర్ జయింట్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కి భారీ జరిమానా పడింది. 24 లక్షల రూపాయలు ఫైన్ విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. స్లో ఓవర్ రేట్ కారణంగానే ఐపీఎల్ నిర్వాహకులు ఇక ఈ జరిమానా విధించారు అని తెలుస్తోంది.. నిర్ణీత సమయంలో లక్నో జట్టు తమ బౌలింగ్ కోట పూర్తి చేయకపోవడంతో ఇలా జరిమానా విధించారు. అయితే కొత్త రూల్స్ ప్రకారం మొదటి సారి స్లో ఓవర్ రేట్ నమోదైతే కెప్టెన్ కి 12 లక్షలు జరిమానా ఇక రెండవ సారి అయితే 24 లక్షల జరిమానా మూడోసారి కూడా రిపీట్ అయితే జట్టులోని సభ్యులు అందరికి ఒక మ్యాచ్ ఫీజ్ కోతతో పాటు అటు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం కూడా ఉంటుంది.


 లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఇలా స్లో ఓవర్ రేట్ నమోదుకావడం రెండోసారి కావడం గమనార్హం. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం 24 లక్షల జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. అంతేకాకుండా ఇక లక్నో తుది జట్టులో ఆటగాళ్ళ అందరి ఫీజులో 25 శాతం కోత విధించినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఊహించని షాక్ తగిలింది. ఒకవేళ మళ్లీ ఇదే తప్పు రిపీట్ చేస్తే ఇక 30 లక్షలు జరిమానా తో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా ఇప్పటివరకు ఐపీఎల్ లో రోహిత్ శర్మ సైతం ఇలా రెండోసారి జరిమానా కట్టాల్సి వచ్చింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: