ఇక టీమిండియా చరిత్రలోనే ఇక ఇలా జరగడం మొదటి సారి అని చెప్పాలి. అయితే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు ఇక ఆయా జట్లకు ఇద్దరు కోచ్ లను కూడా నియమిస్తున్నారు. గతంలో టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా కోచ్గా రవిశాస్త్రి ఇంగ్లాండ్ వెళితే.. ద్వితీయ శ్రేణి జట్టుతో రాహుల్ ద్రవిడ్ కోచ్గా శ్రీలంక పర్యటనకు బయలుదేరింది టీమిండియా. ఇక ఇప్పుడు కూడా ఇలాంటిదే చేయబోతుంది బిసిసీఐ అనేది తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు రాహుల్ ద్రావిడ్. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో ఒక జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.
అదే సమయం లో టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు అటు వివియస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా ఐర్లాండ్ వెళ్లబోతుంది అన్నది తెలుస్తుంది. రాహుల్ ద్రావిడ్ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వివిఎస్ లక్ష్మణ్ ఇక ఇప్పుడు టీమిండియా హెడ్ కోచ్ అవతారం ఎత్తపోతున్నాడు అన్నది తెలుస్తుంది. మిగిలి ఉన్న ఒక టెస్ట్ మ్యాచ్ తో పాటు 3 టి20 లు, మూడు వన్డేలు సిరీస్ లను కూడా ఇంగ్లండ్ పర్యటనలో టీమ్ ఇండియా ఆడ బోతుంది. ఐర్లాండ్లో టీమ్ ఇండియా టి20 సిరీస్ కు లక్ష్మణ్ కోచ్గా వ్యవహరించ పోతున్నాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి