ఎన్నో రోజుల నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మరింత ప్రతిష్టాత్మకంగా ఏకంగా పది జట్లతో మొదలైన ఐపీఎల్ ప్రస్థానం  ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్లు ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్లేఆఫ్ లో అడుగు పెట్టబోయే జట్టు ఏది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఎన్నో మ్యాచ్ ల నుంచి అద్భుతం గా రాణిస్తున్న జట్లు ఇక ఇప్పుడు ప్లే ఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతి అడుగు వేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఎంతో మంది బౌలర్లు బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించి  ప్రశంసలు అందుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన వీరుడికి పర్పుల్ క్యాప్ ఇచ్చి గౌరవించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో యుజ్వేంద్ర చాహల్ వద్ద  పర్పుల్ క్యాప్ కొనసాగుతూ వస్తోంది. కానీ ఇప్పుడు ఐపీఎల్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ఇక ఈ పర్పుల్ క్యాప్ సొంతం చేసుకునే విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంది అని చెప్పాలి.


 ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఇరవై నాలుగు వికెట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగాడు. చివరకు అతన్ని ఎవరు బీట్ చేయలేదు అని చెప్పాలి.  కానీ ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్పిన్నర్ హసరంగా ఇరవై నాలుగు వికెట్లతో చాహల్ ను అధిగమించాడు అని చెప్పాలి. ఎకానమి లో కూడా  అందరి కంటే ముందు ఉన్నాడు. ఇక మూడు నాలుగవ ప్లేస్ లో రబడా 22 వికెట్లతో,  ఉమ్రాన్ మాలిక్ 21 వికెట్లతో కొనసాగుతున్నారు. దీంతో పూర్తిగా ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి ఎవరు పర్పుల్ క్యాప్ సొంతం చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: