ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రతి ఏడాది ప్రతిభ గల యువ ఆటగాళ్లు   తెరమీదికి వచ్చినట్లుగానే ఇక ఈ ఏడాది కూడా ఎంతో మంది ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఇలా ప్రతిభ చాటిన యువ ఆటగాళ్లలో ఉమ్రాన్ మాలిక్ కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జమ్మూ కాశ్మీర్ ప్లేయర్ తన పేస్ బౌలింగ్ లో అందరిని ఆశ్చర్యపరిచాడు అనే చెప్పాలి. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాదు ఏకంగా ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. బుల్లెట్ లాంటి బంతులను విసురుతూ బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు ఉమ్రాన్ మాలిక్.


 ఈ క్రమంలోనే ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ బౌలింగ్ చూసి అటు మాజీ ఆటగాళ్లు అందరూ ఫిదా అయిపోయారు అని చెప్పాలి. ఇప్పటి వరకూ భారత క్రికెట్ లో ఇలాంటి ఫాస్ట్ బౌలర్లను చూడలేదు అంటూ ప్రశంసలు కురిపించారు. తక్కువ రోజుల్లోనే అతనికి టీమిండియాలో చోటు దక్కడం ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని టీమిండియా లోకి తీసుకోండి అంటూ మరికొంతమంది డిమాండ్ కూడా చేశారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఉమ్రాన్ మాలిక్ ప్రతిభపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ బ్రయాన్ లారా ప్రశంసల వర్షం కురిపించడం గమనార్హం. అతని బౌలింగ్ శైలి స్పీడు చూస్తుంటే వెస్టిండీస్ మాజీ పేసర్ ఎడ్వర్డ్స్ గుర్తుకు వస్తున్నాడు అంటూ బ్రియాన్ లారా చెప్పుకొచ్చాడు.  ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే  అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తీరుతాడు అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఏకంగా 157 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరే రికార్డు సృష్టించాడు ఉమ్రాన్ మాలిక్. అంతేకాకుండా 21 వికెట్లు పడగొట్టి సన్రైజర్స్ జట్టులో కీలకంగా వ్యవహరించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాతో టీమిండియా  ఆడబోయే సిరీస్ కి అతని ఎంపిక అవుతాడు అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl