టీమ్ ఇండియా అంతర్జాతీయ క్రికెట్ లో చోటు దక్కించుకోవడానికి ఎంతో మంది యువకులు పోటీ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో ఐపీఎల్ ప్రారంభమైన తరువాత ఎక్కువ మంది యువకులు క్రికెట్ వైపు అడుగులు వేస్తూ ఉండడంతో టీమిండియాలో చోటు తగ్గించుకోవడానికి పోటీ మరింత తీవ్రతరం అయింది అని చెప్పాలి. టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న అందరి కంటే మంచి ప్రదర్శన చేసినప్పుడే ఇక భారత జట్టు తరఫున ఆడాలి అనే ఆశ నెరవేరుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోని మరో రెండేళ్లలో తాను టీమిండియాకు సెలెక్ట్ అవ్వటమే నా లక్ష్యం అంటూ  చెబుతున్నాడు నెల్లూరు కుర్రాడు అశ్విన్ హెబ్బర్.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు అశ్విన్. ఈ క్రమంలోనే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సక్సెస్ కి షార్ట్ కట్స్ లేవని ప్రతి ఒకరు కష్టపడుతూ తమ తమ రంగాల్లో రాణించాలి అంటూ చెబుతున్నాడు. ఇక నెల్లూరులోని స్టేడియంలో క్రికెట్ ఆడుతూ చిన్నప్పటినుంచి క్రికెట్ నీ శ్వాస గా పెట్టుకున్నాను. అందుకే సక్సెస్ కాగలుగుతున్నా అని అంటూ చెబుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్కు ఏపీ నుంచి ఇద్దరు సెలెక్ట్ కాగా అందులో ఒకరు కేఎస్ భరత్ మరొకరు అశ్విన్ హెబ్బార్. ఐపీఎల్ అనేది టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్.



 ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో భాగంగా తన ప్రతిభను చూసి ఇక ఐపీఎల్లో ఎంపిక చేశారని అశ్విని హెబ్బార్ చెప్పుకొచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీతో అదరగొట్టాడు అశ్విన్. ఈ క్రమంలోనే ఎనిమిది ఫ్రాంఛైజీల దగ్గరకు తాను ట్రయల్స్ కు వెళ్ళగా చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ కి సెలెక్ట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు. 1995 నవంబర్ 15 న నెల్లూరు లో జన్మించిన అశ్విన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్.. రైట్ ఆర్మ్ పేస్ బౌలర్ కూడా కావడం గమనార్హం. యువ ఆటగాడు ఇండియాకు ఆడాలనే కల భవిష్యత్తులో నెరవేరుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: