సౌతాఫ్రికాతో ఢిల్లీ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ ఓటమి పాలు అయింది. ఇక యువ కెప్టెన్ రిషబ్ పంత్ సారథ్యంలో అటు టీమిండియా ఓటమి పాలు కావడంతో అతని కెప్టెన్సీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీమిండియా కెప్టెన్సీ అనేసరికి రిషబ్ పంత్ ఒత్తిడిలో మునిగిపోయాడని.. అందుకే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ లను భారత బౌలర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారని.. పంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు అంటూ పలు కారణాలను తెరమీదికి తీసుకువస్తూ రిషబ్ పంత్ కెప్టెన్సీపై విమర్శలు చేస్తున్నారు.


 టీమ్ ఇండియా హిస్టరీ లోనే మొదటి సారి 200కు పైగా భారీ పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక టి-20లో ఓటమి చవిచూసింది టీమిండియా. ఇలా రిషబ్ పంత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రిషబ్ పంత్ కి మద్దతుగా నిలిచాడు తొలి మ్యాచ్లో బౌలర్లు విఫలమైనప్పటికీ రెండవ టి-20లో మాత్రం తమ బౌలర్లు బలంగా తిరిగి వస్తారని భువనేశ్వర్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. రిషబ్ పంత్ ఒక యంగ్ కెప్టెన్.. ఇదే విధంగా అతనికి ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్.


 ఈ క్రమం లోనే అతడు రానున్న మ్యాచ్ లలో కెప్టెన్గా అద్భుతం గా రాణిస్తాడు. అలాగే కెప్టెన్ ఒక్కడే జట్టు లో సరిగ్గా ఉంటే సరిపోదు.. అందరూ రానిస్తేనే  విజయం సాధిస్తాం.. తొలి మ్యాచ్లో మా బౌలింగ్ విభాగం ఎంతగానో నిరాశపరిచింది. మేము బాగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించి ఉంటే అందరూ పంత్ నిర్ణయాత్మక నైపుణ్యాలను ప్రశంసించేవారు. రెండవ టీ 20 మ్యాచ్ లో మాత్రం మా బౌలర్లు అద్భుతంగా రాణిస్తారు అని ఆశిస్తున్నాను అంటూ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు. కాగా నేడు జరగబోయే మ్యాచ్లో భారత బౌలర్లు ఎంత మేరకు రాణిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: