అంతేకాదండోయ్ ఇక ప్రత్యర్థులుగా కొనసాగుతున్న ఇద్దరు ప్లేయర్లు కూడా అటు కవలపిల్లలు కావడం గమనార్హం. ఈ ఆసక్తికరమైన ఘటన ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో చోటుచేసుకుంది. టెస్ట్ క్రికెట్ లో భాగంగా సోమర్సెట్, సర్రే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో ఓవర్టన్ బ్రదర్స్ ఆడుతూ ఉన్నారు. ఇక అన్నయ్య క్రెయిన్ ఓవర్టన్ సోమర్సెట్ తరఫున ఇక తమ్ముడు జెమి ఓవర్టన్ సర్రే జట్టు తరఫున ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్లో భాగంగా మొదట సోమర్సెట్ బ్యాటింగ్కు దిగింది. జెమి ఓవర్టన్ మూడు వికెట్లతో రెచ్చిపోయాడు.
ఈక్రమంలోనే అన్నయ్య క్రెయిన్ ఓవర్టన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ చేయడానికి వచ్చాడు తమ్ముడు జెమి ఓవర్టన్. ఈ క్రమంలోనే అన్నయ్య అని కూడా చూడకుండా పదునైన బౌన్సర్ వేసాడు. ఇది కాస్త క్రెయిన్ ఓవర్టన్ హెల్మెట్ కు బలంగా తాకింది. దీంతో అతను పిచ్పై కుప్పకూలిపోయాడు. అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత ఫిజియో వచ్చి అతనిని పరిశీలించి.. తరవాత అతను రిటైర్డ్ హర్ట్ గా వెళ్ళిపోవడం చకచక జరిగిపోయాయి అని చెప్పాలి. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసి ఎంత అన్నదమ్ములైనా మ్యాచ్ లో మాత్రం ప్రత్యర్థులు గానే ఉంటారన్నది ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అని అంటున్నారు నెటిజన్లు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి