అప్పటి వరకు ఎవరికీ ముక్కు ముఖం తెలియని వారు కామన్వెల్త్ క్రీడలు  ఒలంపిక్స్ లాంటి విశ్వ వేదికపై ఒక పతకాన్ని సాధించారు అంటే చాలు ప్రతి ఒక్కరికి సుపరిచితులు గా మారిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎంతో కష్టపడి వచ్చిన క్రీడాకారులను కదిలిస్తే మాత్రం కన్నీరు పెట్టించే విషాదం కూడా ఉంటుంది అన్నది కొంతమంది విషయంలో నిజాం అవుతూ ఉంటుంది.  భారత్ కి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన ఒక వీరుని కథ లో కూడా ఇలాంటి విషాదమే ఉంది.  అతని పేరు అచింత షూలి.  ఏమి తెలియని వయసులో తండ్రి మరణించాడు. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి.. కుట్టు పనులతో కుటుంబాన్ని చూసుకునేది ఆ తల్లి. ఇక తండ్రి మరణం తర్వాత అన్న ఒకటే నిర్ణయించుకున్నాడు. తమ్ముడికి గొప్ప జీవితాన్ని ఇవ్వడం కోసం ఎంత కష్టపడినా పర్వాలేదు అని అనుకున్నాడు.


 ఈ క్రమంలోనే తాను కష్టపడుతూ తమ్ముడిని రత్నంలా మార్చాడు. పశ్చిమ బెంగాల్లోని హౌడా జిల్లాలోని చిన్న ఊరు దేవుని పూర్. జెర్రీ వర్కు పేరుగాంచిన ఈ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు అచింత షూలి. రిక్షా తోలుతూ ఉండే వాడు తండ్రి. కుట్టు పనులు చేసేది  తల్లి. అన్న అలోక్ చిన్ననాటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ అంటే ఇష్టం. దీంతో క్రీడలో అతను శిక్షణ తీసుకుంటూ ఉండేవాడు. అయితే పదకొండేళ్ల వయసులో పతంగులు ఎగురవేయడం  ఎంతగానో సరదా వాటిని పట్టుకుంనేందుకు పరిగెత్తుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఒక వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామశాల దగ్గరికి వెళ్ళాడు. అనుకోకుండా అక్కడ అతనికి మనసు పారేసుకున్నాడు. ఆరోజు నుంచి వెయిట్ లిఫ్టింగ్ లో  శిక్షణకు వెళ్లడం మొదలుపెట్టాడు.


 జీవితం హాయిగా సాగుతుంది అనుకుంటున్న సమయంలోనే అతని జీవితంలో షాకింగ్ ఘటన. పెద్దదిక్కుగా ఉన్న తండ్రి జగత్ గుండెపోటుతో హఠాత్ మరణం చెందాడు. అప్పటికి అన్నదమ్ములిద్దరూ చిన్నవారే. ఈ క్రమంలోనే తనకంటే తమ్ముడు లోనే ఎక్కువ ప్రతిభ దాగి ఉంది అని అన్న అలోక్ భావించాడు. తన ఆశలను త్యాగం చేసి తమ్ముడు కోసం కష్టపడ్డాడు. జాతీయ జూనియర్ అథ్లెటిక్  పోటీల్లో పథకం సాధించడం  నుంచి మంచి రోజులు మొదలయ్యాయి. ఆ తర్వాత కామన్వెల్త్ యూత్ ఛాంపియన్షిప్,  ఆసియా యూత్ ఛాంపియన్షిప్ లలో పతకాలు సాధించాడు.. గత ఏడాది కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో స్వర్ణంతో  నిలిచాడు. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకాన్ని  సాధించి పెట్టాడు బంగారంలాంటి ఈ అథ్లెట్ .

మరింత సమాచారం తెలుసుకోండి: