ఇండియన్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ తర్వాత వాల్ అఫ్ ఇండియా గా పేరు తెచ్చుకున్న ఏకైక బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా. ఇతను క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్ విసిగిపోవాల్సిందే. బంతిని ఎలా సంధించినా ఎంతో ఓపికగా డిఫెండ్ చేస్తుంటాడు. పుజారా గంటల తరబడి వికెట్ ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థుల విజయాలకు అడ్డుకట్ట వేస్తూ ఉంటాడు. అయితే ఈ తరహా ఆటంతా మొన్న ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ వరకు మాత్రమే. ఆ తర్వాత పుజారా కొత్తగా మారిపోయాడు. ఆ మధ్యన టెస్ట్ లలోనూ నిలకడగా పరుగులు సాధించిడంలో విఫలం అయిన పుజారా ఇంగ్లాండ్ లో జరిగే కౌంటీలలో ఆడి ఫామ్ లోకి రావాలని భావించి ససెక్స్ జట్టు తరపున ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన అదృష్టం ఏకంగా ఆ జట్టుకు కెప్టెన్ గా ఇప్పుడు వ్యవహరిస్తుండడం విశేషం.

కాగా ప్రస్తుతం రాయల్ లండన్ వన్ డే కప్ పేరుతో  50 ఓవర్ ల ఫార్మాట్ జరుగుతోంది. ఇందులో పుజారా తన శైలికి పూర్తి భిన్నంగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. మాములుగా ఇంగ్లాండ్ గడ్డపై ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఒక టెస్ట్ ఆటగాడిగా ముద్రపడిన ఛతేశ్వర్ పుజారా ఈ వన్ డే సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే రెండు భారీ సెంచరీలు మరియు ఒక అర్ద సెంచరీ సాధించి ఇండియన్ సెలెక్టర్ లను సందిగ్ధంలో పడేశాడు. తాను సాధించిన సెంచరీలు కూడా 100 కు పైగా స్ట్రైక్ రేట్ తో ఉన్నాయి.  

ఈ దెబ్బతో పుజారాపై టెస్ట్ బ్యాట్స్మన్ అన్న ముద్ర తొలగిపోతుంది. కాగా టెస్ట్ ల నుండి పుజారా త్వరలోనే వన్ డే లలోకి ఎంట్రీ ఇస్తాడని తన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మరి చూద్దాం... త్వరలోనే పుజారా వన్ డే లలో ఏ తరహా ఇన్నింగ్స్ ను ఆడుతాడా లేదా అన్నది... అయితే ప్రస్తుతం టీం లో ఉన్న పోటీ చూస్తే వయసు మీద పడిన పుజారాకు సెలెక్టర్ లు అవకాశం కల్పిస్తారా అన్నది ప్రశార్ధకమే ?

మరింత సమాచారం తెలుసుకోండి: