టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త లేటు వయసులో కూడా ఇంకా కుర్రాడి లాగే  ఫీలవుతూ వుంటాడు రవిశాస్త్రి. ఈ క్రమంలోనే ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ సరదాగా గడుపుతూ ఉంటాడు అని చెప్పాలి. అయితే రవి శాస్త్రి టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. చారిత్రాత్మక విషయాలను ఖాతాలో వేసుకుంది. కానీ ప్రపంచ కప్ టోర్నీలో మాత్రం టైటిల్ విజేత గా నిలువలేక పోయింది అని చెప్పాలి. ఆ ఒక్కటి మినహా రావిశాస్త్రి కోచింగ్ కి వంక పెట్టాలంటే ఏ కారణం దొరకదు అని చెప్పాలి.


 ఇక ఎంతో దూకుడుగా ఉంటూ అదే దూకుడును ఆటగాళ్లలో ఉండేలా చేస్తూ కోచింగ్ లో ఎంతో మంది ఆటగాళ్లను అత్యుత్తమ ప్రదర్శన చేసే ప్లేయర్ లుగా తయారు చేశాడు రవిశాస్త్రి. అయితే ఇటీవల మాజీ కోచ్ రవి శాస్త్రి గురించి టీమిండియా బ్యాట్స్మెన్ దినేష్ కార్తీక్ ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కోచ్ రావిశాస్త్రికి ఓపిక తక్కువ అంటూ చెప్పుకొచ్చాడు.ఎవరైనా ఆటగాడు బాగా ఆడిన సమయాల్లో అందరికంటే ఎక్కువ సంబరాలు చేసుకునేది రవిశాస్త్రి మాత్రమే. అదే సమయంలో ఎవరైనా సరిగా ఆడక పోతే అసహనం వ్యక్తం చేసేవాడు అంటూ చెప్పుకొచ్చాడు.


 ఆయన అనుకున్న విధంగా బ్యాటింగ్ చేయకపోయినా బంతులను సందించకపోయినా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవాడు. అంతేకాదు ఎలా ఆడాలో కూడా నెట్స్ లో విభిన్నంగా ఆడటం చూపిస్తూ ఆటగాళ్లను మరింత మెరుగు పడేలా చేసేవాడు. ఇక ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారి నుంచి ఫలితం రాబట్టుకునే వాడు. అయితే తన జట్టు నుంచి ఏం కావాలో దానిని ఆశించేవాడు రవిశాస్త్రి. ఏ విధంగా ఆడినా కూడా ఫలితం మాత్రం మనకు అనుకూలంగానే ఉండాలి అంటూ చెప్పేవాడు.  ఒకవేళ  జట్టు ఓటమి పాలైతే ఆయనలో ఓర్పు నశించేది. అయితే కోచ్ గా ప్లేయర్ లో ఉన్న టాలెంట్ వెలికి తీయడంలో ఆయన ఎంతో సిద్ధహస్తుడు. ఇప్పటివరకు అనుకున్నదానికన్నా ఎక్కువ ఫలితాలను రాబట్టాడు అంటూ దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: