టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శుక్రవారం నాడు నాగ్‌పూర్‌లో తన విశ్వరూపం చూపాడు. ఆసీస్ బౌలర్లకు తాను ఎదుర్కున్న రెండో బంతి నుంచే చుక్కలు లెక్కించే పని కల్పించాడు. గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ కు రావడం.. రెండు మూడు భారీ షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరడమే తప్ప ఇన్నింగ్స్ చివరివరకు నిలబడి మెరుపులు మెరిపించిన రోహిత్ ను చూసి చాలాకాలమైంది.కానీ శుక్రవారం నాడు రాత్రి అతడి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులకు ఆ అవకాశం దక్కింది. 8 ఓవర్లకే 91 పరుగులు ఛేదించాల్సిన క్రమంలో తాను ఎదుర్కున్న రెండో బంతి నుంచే ఆసీస్ బౌలర్లకు చుక్కలు లెక్కించే పని చేశాడు హిట్‌మ్యాన్.టీ20లలో ప్రపంచ నెంబర్ వన్ బౌలరైన జోష్ హెజిల్వుడ్ మొదలు పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, డేనియల్ సామ్స్ అందరి బౌలింగ్ లో దంచికొట్టాడు. 20 బంతుల్లోనే 46 పరుగులు చేసిన రోహిత్.. 4 భారీ సిక్సర్లు, 4 బౌండరీలు బాదాడు.


ఈ క్రమంలో రోహిత్ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్ లో భాగంగా హెజిల్వుడ్ వేసిన తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతికి సిక్సర్ కొట్టాడు. దీంతో అతడు మార్టిన్ గప్తిల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల (172) ను అధిగమించాడు. ఆ తర్వాత రోహిత్ మరో మూడు సిక్సర్లు బాదాడు.అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన వారి జాబితా చూస్తే రోహిత్ శర్మ.. 176 సిక్సర్లతో తొలిస్థానంలో ఉండగా మార్టిన్ గప్తిల్ (172) రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 124 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇయాన్ మోర్గాన్ (12), ఆరోన్ ఫించ్ (119) ల తర్వాత స్థానాల్లో నిలిచారు.ప్రస్తుతం రోహిత్ ఫ్యాన్స్ ఆయన వరల్డ్ రికార్డుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: