వరల్డ్ రెస్లింగ్ ఎంటర్టైన్మెంట్ చూసే వారికి జాన్ సీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే డబ్ల్యూ డబ్ల్యూఈ ప్రేక్షకులందరికీ కూడా ఫేవరెట్ జాన్ సీనా. పిల్లలనుంచి పెద్దల వరకు అందరిలో కూడా ఇతనికి చాలా ఫాలోయింగ్ ఉంది. రెస్లింగ్ రింగులో ప్రత్యర్థులను రఫ్పాడించే జాన్ సేన ఇక తనను ఎంతగానో అభిమానించి ప్రేక్షకుల పట్ల కూడా ఎంతగానో ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా పిల్లలు అంటే జాన్ సీనాకు ఎంతగానో ఇష్టం. అందుకే పిల్లల పట్ల ఎప్పుడు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు అని చెప్పాలి.


 ఇలా పిల్లల పట్ల జాన్ సేన వ్యవహరించే తీరే ఆయనను ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది అని చెప్పాలి. ఇకపోతే ఇప్పటివరకు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోటీలలో తన ఆట తీరుతో ఎంతగానో ఆకట్టుకున్న జాన్ సీనా తన మంచితనంతో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. అత్యధిక మంది పిల్లల కోరికలు తీర్చిన రెజ్లర్ గా జాన్ సేన అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.


 అమెరికాకు చెందిన రెజ్లర్ జాన్ సేన 2002 నుంచి మీకే విష్ ఫౌండేషన్ తో కలిసి పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే పిల్లల కోరికలను తీర్చుతూ వస్తున్నాడు జాన్ సేన. తనను కలవాలనుకునే వారిని కోరిక తీర్చేందుకు తన సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకుని సరదాగా వారితో గడుపుతూ ఉంటాడు. కాగా ఇప్పుడు వరకు ఏకంగా 650 మంది పిల్లల కోరికలను తీర్చాడు జాన్ సీనా. రెండున్నర సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఇందులో ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు వరకు రెజ్లర్ల లో 200 కుమించి ఎక్కువమంది పిల్లల కోరికలు తీర్చిన వారు ఎవరూ లేరు. కానీ జాన్ సేన మాత్రం 650 మంది పిల్లల కోరికలను తీర్చాడు.దీంతో గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: