కాగా మొత్తంగా ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ లో 16 జట్లు పాల్గొనబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనె ఏ జట్టు ఎలా రాణించబోతుంది అనే విషయంపై ఇప్పటికే అటు ఎంతో మంది మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ తమ రివ్యూలు చెప్పేశారు. ఇప్పుడు మ్యాచ్లు మొదలైన నేపథ్యంలో విశ్లేషకులు తమ రివ్యూలకు మరింత సాన పెట్టబోతున్నారు అన్నది మాత్రం తెలుస్తుంది. ఇకపోతే ఇటీవల ఐసీసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక ఫోటో కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న 16 జట్లకు కెప్టెన్ లుగా ఉన్న 16 మంది ఆటగాళ్ల లను ఒకే ఫ్రేమ్ లో బంధించి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫ్రేమ్ లో .. ఇండియా(రోహిత్ శర్మ), ఆస్ట్రేలియా(ఆరోన్ ఫించ్), ఇంగ్లండ్(జోస్ బట్లర్), పాకిస్తాన్(బాబర్ ఆజం), అఫ్గనిస్తాన్(మహ్మద్ నబీ), శ్రీలంక(దసున్ షనక), న్యూజిలాండ్(కేన్ విలియమ్సన్), బంగ్లాదేశ్(షకీబ్ అల్ హసన్), వెస్టిండీస్(నికోలస్ పూరన్), సౌతాఫ్రికా(తెంబా బవుమా), జింబాబ్వే(క్రెయిగ్ ఎర్విన్), నమీబియా(గెర్హార్డ్ ఎరాస్మస్), ఐర్లాండ్(ఆండ్రూ బల్బిర్నీ), స్కాట్లాండ్(రిచర్డ్ బెరింగ్టన్), నెదర్లాండ్స్(స్కాట్ ఎడ్వర్డ్స్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(సీపీ రిజ్వాన్) కెప్టెన్లు ట్రోఫీతో ఫోజులు ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి