ఇకపోతే గత ఏడాది ప్రపంచకప్ లో షాహిన్ ఆఫ్రిదిని ఎదుర్కోవడంలో విఫలం అయిన భారత బ్యాట్స్మెన్లు ఇక ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. షాహిన్ బౌలింగ్ ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పలువురు మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ టీమ్ ఇండియా బ్యాటర్లకు సూచనలు సలహాలు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే అందరూ షాహిన్ ఆఫ్రిది నుంచి టీమిండియా కు ప్రమాదం ఉంది అని వ్యాఖ్యానిస్తూ ఉంటే.. అటు మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా కు అసలు ప్రమాదం షాహిన్ అఫ్రీదితో కాదని హరీష్ రౌఫ్ తో అసలు సమస్య అంటూ తెలిపాడు ఫుల్ స్వింగింగ్, ఫాస్ట్ బౌలింగ్లో ఆఫ్రిది అతడి అత్యుత్తమ ప్రదర్శనకు దగ్గరగా ఆడుతున్నాడు. అయితే ఈ ప్రపంచకప్ లో షాహిన్ రోహిత్ సేనను ఇబ్బంది పెట్టేంత ఆటగాడు ఏమీ కాదు అని నా అభిప్రాయం. కానీ టీమ్ ఇండియాకు అసలైన ప్రమాదకారి హరీష్ రౌఫ్ అంటూ ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. కఠినమైన ఓవర్లలో బౌలింగ్ చేసి ఆటలో వైవిధ్యం చూపగల సామర్థ్యం అతనికి ఉంది అటు ఆకాష్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. కాగా హరీష్ రౌఫ్ ఇటీవల ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి