ఈ క్రమంలోని రానున్న రోజుల్లో ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి అనే విషయంపై అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో ఆసక్తికర చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇదే విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారూ అని చెప్పాలి. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్లో కాకుండా తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహిస్తామని ఎసిసి అధ్యక్షుడు జే షా వ్యాఖ్యానించడం పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు దానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ పాకిస్తాన్లో జరగాల్సిన ఆసియా కప్ ను తటస్థ వేదికపై నిర్వహిస్తే తాము ఏసీసీ నుంచి తప్పుకుంటాం అంటూ పాకిస్తాన్ వ్యాఖ్యానిచ్చింది. కానీ పాకిస్తాన్ అన్నంత పని చేయలేదు.. పి సి బి కి వేరే దారి లేదు.. ఇక భారత్ చెప్పినట్లు తప్పకుండా వినాల్సిందే. ఒకవేళ భారత క్రికెట్ బోర్డు తలచుకుంటే పాకిస్తాన్లో ఎలాంటి ఐసిసి ఈవెంట్ జరగకుండా రద్దు చేయగలదు అంటూ డేనిష్ కనేరియా వ్యాఖ్యానించాడు. ఇలా ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డ్ గా కొనసాగుతున్న బీసీసీఐ ప్రపంచ క్రికెట్ను శాసిస్తుంది అన్న విషయాన్ని ఇండైరెక్టుగా చెప్పాడు డేనిష్ కనేరియా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి