ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన  పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు అని చెప్పాలి.  అయితే ఇలా వరల్డ్ కప్ లో బోనీ కొట్టిన టీమిండియా జట్టు ఇక గ్రూప్ 2 లో భాగంగా మరో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా జట్లతో తలపడాల్సి ఉంది అని చెప్పాలి.


 అయితే ఇక ఈ నాలుగు జట్లలో కూడా టీమ్ ఇండియాకు బలమైన పోటీ ఇచ్చే జట్టు ఏది అంటే అటు సౌత్ ఆఫ్రికా అని చెప్పాలి. ఇక మిగతావన్నీ కూడా టీమిండియా ప్రదర్శన ముందు దిగదుడుపు అని చెప్పాలి. అదే సమయంలో చిన్న జట్లు అయినా కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అయితే గ్రూప్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు జరగకగా పాకిస్తాన్ పై భారత్ గెలిచింది. నెదర్లాండ్స్పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. సౌత్ ఆఫ్రికా జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. గ్రూప్లో పటిష్టమైన జట్లే సెమిస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక క్రికెట్ గురించి తెలిసిన ఎవరైనా సరే సెమిస్ కోసం పోటీపడే జట్లు భారత్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా అని చెబుతారు.


 అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి భారత్ దర్జాగా సెమీస్ కి దూసుకెళ్లే ఆకాశం ఉంది అని తెలుస్తుంది. తదుపరి జరగబోయే రెండు మ్యాచ్ లలో గెలిచిన కూడా అటు భారత్ సెమిస్ చేరడం నల్లేరుపై నడకే అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక గ్రూప్లో నెదర్లాండ్స్, జింబాబ్వే బంగ్లాదేశ్ లాంటి జట్లు ఉండటంతో భారత్కు విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అన్న అంచనా కూడా వేస్తున్నారు. ఇలా బలమైన సౌతాఫ్రికా చేతిలో పొరపాటున ఓడిన మిగతా మూడు జట్ల పై విజయం సాధించిన కూడా సెమీస్ వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: