ఇలా అందరూ కూడా దక్షిణాఫ్రికా తో మ్యాచ్లో ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి చవిచూసింది అని ఆరోపిస్తూ ఉంటే అటు మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం కొత్త విషయాన్ని తరిమేదికి తీసుకువచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఓటమికి ఫీల్డింగ్ వైఫల్యం కారణం కాదని అసలైన సమస్య మరొకటి ఉంది అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ తో గవాస్కర్ మాట్లాడుతూ.. సాధారణంగా క్రికెట్లో క్యాచ్లు వదిలేయడం రనౌట్ అవకాశాలను చేజార్చడం జరుగుతూనే ఉంటుంది. ఇక ఓటమికి ఎవరిని నిందించడానికి లేదు. అదృష్టం అనేది ప్రతిసారి ఒకరి వైపే ఉండదు.
టాప్ ప్లేయర్లు కూడా క్యాచ్లు విడవడం, రన్ అవుట్ మిస్ చేయడం లాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. అయితే ఫీల్డింగ్ వైఫల్యం కంటే అతిపెద్ద సమస్య ఇంకొకటి ఉంది అని అనిపిస్తుంది. స్వల్ప స్కోర్లు నమోదు అయిన మ్యాచ్ లో ఒక్కరే 43 పరుగులు సమర్పించడం అసలైన సమస్య అంటూ గవస్కర్ చెప్పుకొచ్చాడు. అశ్విన్ తన నాలుగు ఓవర్ల కోటాలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. జట్టులో ఉన్న మిగతా బౌలర్లు అందరూ కూడా పరుగులు కట్టడం చేస్తూ బాగా రానిస్తే అశ్విన్ మాత్రం అందరూ కట్టడి చేసిన పరుగులను ధారాళంగా సమర్పించుకున్నాడు అని చెప్పాలి. ఒక వికెట్ తీసినప్పటికీ పరుగులు ఎక్కువగా ఇవ్వడం టీమిండియా కు మైనస్ గా మారింది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి