గత కొంతకాలం నుంచి టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ లలో ఎంత విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో చూస్తూనే ఉన్నాం. టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్లిన లేకపోతే విదేశీ జట్టు టీమ్ ఇండియా పర్యటనకు వచ్చిన ఇక సిరీస్ కైవసం చేసుకునేది మాత్రం భారత జట్టే అన్న విధంగా ఇక హవా నడిపిస్తుంది అని చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తిరుగులేని జట్టుగా టీమిండియా ఎదిగింది. దీంతో టీమ్ ఇండియాతో మ్యాచ్ అంటే చాలు ఇక ప్రత్యర్థి జట్టులో వణుకు పుట్టే విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.


 అలాంటి టీమిండియా జట్టు అటు వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ లలో మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక పోతుంది. ఇక ఇందుకు ఇటీవలే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ నిదర్శనం అని చెప్పాలి. ఒకప్పుడు కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా ద్వైపాక్షిక సిరీస్లలో ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధించిన టీమిండియా వరల్డ్ కప్లలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోహిత్ శర్మ సారధిగా వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనుకున్నప్పటికీ మళ్లీ అదే వైఫల్యం కొనసాగింది.


 ముఖ్యంగా ఏడాది టీ20లలో టీమిండి అదరగొట్టింది అని చెప్పాలి. వెస్టిండీస్ తో 3-0, శ్రీలంక తో 3-0,  ఐర్లాండ్ 2-0,   ఇంగ్లాండ్ తో 2- 1,  వెస్టిండీస్ పై 4 - 1, ఆస్ట్రేలియాపై 2-1, సౌత్ ఆఫ్రికాపై 2-1, న్యూజిలాండ్ పై 1 - 0 ఇలా అన్ని జట్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. కానీ ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో  మాత్రం చతికిలబడింది టీం ఇండియా. దీంతో ఫాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్లలో గెలిస్తే ఏం వస్తుంది వరల్డ్ కప్ గెలిస్తే కదా అసలైన విజయం సాధించినట్లు అవుతుంది అంటూ ఎంతో మంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: