ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా దిగ్గజ జట్టుగా కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి తన హవా నడిపించింది. అయితే ఇలా వన్డే వరల్డ్ కప్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ఆస్ట్రేలియా కు టి20 వరల్డ్ కప్ మాత్రం గత ఏడాది వరకు కూడా అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎన్నోసార్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా చివరికి నిరాశ పరుస్తూనే వచ్చింది. కానీ 2021 తిన్నావా టి20 వరల్డ్ కప్ లో మాత్రం మొదటిసారి ఆస్ట్రేలియా జట్టు పొట్టి ఫార్మాట్ లో వరల్డ్ కప్ అందుకుంది.


 ఇలా ఆస్ట్రేలియా జట్టు వరల్డ్ కప్ అందుకోవడంలో ఆ జట్టు హెడ్ కోచ్గా వ్యవహరించిన జస్టిన్ లాంగర్  దే కీలకపాత్ర అని చెప్పాలి. అలాంటి లాంగర్ ను ఆ తర్వాత కాలంలో మాత్రం ఊహించని రీతిలో కోచ్ పదవి నుంచి తప్పించారు. కొంతమంది ఆస్ట్రేలియా క్రికెటర్లు కోరుకోవడం తోనే ఇలా చేయాల్సి వచ్చిందని అప్పట్లో క్రికెట్ ఆస్ట్రేలియా సైతం వివరణ ఇచ్చింది. అయితే ఇక కోచ్ పదవి నుంచి తప్పించినప్పటికీ ఎవరిని తప్పు పట్టకుండా సైలెంట్ గా ఉన్న జస్టిన్ లాంగర్ ఇటీవల కొంతమంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.


 నేను కోచ్గా ఉన్నప్పుడు జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ నా ముందు ఎంతో బాగుండేవారు. అలాంటి సమయంలోనే నన్ను తొలగించడానికి నా వెనకాల మంతనాలు జరుపుతున్నారని కొంతమంది చెప్పినా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత అసలు విషయం అర్థమయ్యి ఆశ్చర్యపోయాను. చాలామంది జర్నలిస్టులు సోర్స్ అనే పాదం వాడుతుంటారు. కానీ నేను మాత్రం అలాంటి వారిని పిరికి వందలు అని అంటాను. ఎందుకంటే గొడ్డలి తీసుకుని అవతలి వారితో కలిసి నరికేసి. మన ముందుకు ఏమి చెప్పకుండా ఉంటారు. కేవలం తమ అజెండా  అమలు చేసేందుకు కొన్ని లీకులు ఇస్తూ ఉంటారు. ఇక కోచ్గా నన్ను తప్పించడమే నా జీవితంలో కఠినమైన విషయం అంటూ జస్టిన్ లంగార్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: