గత కొంతకాలం నుంచి టి20 ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ తన హవా నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే అటు టి20 ఫార్మాట్లో విధ్వంసకరమైన బ్యాటింగ్ తో గుర్తింపు సంపాదించుకున్న స్టార్ ప్లేయర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ సూర్యకుమార్ మాత్రం అందరిని వెనక్కి నెట్టి టి20 ఫార్మాట్లో అవకాశం దక్కించుకున్న ఏడాది సమయంలోనే నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా అవతరించాడు. తన అగ్రస్థానాన్ని కాపాడుకునే విధంగా ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయి  భారీగా పరుగులు చేయడం చూసాము. కానీ ఎందుకో సూర్య కుమార్ యాదవ్ మైదానం నలువైపులా షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతూ ఉండటం చూస్తూ ఉంటే మాత్రం సగటు క్రికెట్ ప్రేక్షకుడికి అతని ఆటను ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. అంతలా తన బ్యాటింగ్ తో ప్రభావితం చేస్తున్న సూర్య కుమార్ యాదవ్ ఏకంగా ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు అని చెప్పాలి. ఏకంగా టి20 ఫార్మాట్ ను ఫ్యూచర్ లో శాసించేది సూర్య కుమార్ యాదవ్ మాత్రమే అని ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు.


 ఏకంగా సూర్య కుమార్ యాదవ్ ఆట తీరుపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూసాం. అతను ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 బ్యాట్స్మెన్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటూ విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ దాటినీ ఎదుర్కోవడం కొత్త బౌలర్లకే కాదు సీనియర్ బౌలర్లకు సైతం ఒక ఛాలెంజ్ లాంటిది అంటూ కేన్ విలియమ్సన్  ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: