ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్ని రికార్డులు కొలగొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కోహ్లీ రికార్డుల గురించి చెప్పుకుంటూ పోతే ఇక ఎన్ని పేజీలు రాసిన కూడా రికార్డుల వివరాలు మాత్రం ఇంకా పూర్తవ్వవు అని చెప్పాలి. ఆ రేంజ్ లో అంతర్జాతీయ క్రికెట్లో హవా నడిపించాడు. రికార్డుల విషయంలో నేటితరం క్రికెటర్లకు ఎవరికి అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ.


ఇక మొన్నటి వరకు ఫెయివమైన ఫామ్ తో ఇబ్బంది పడినప్పటికీ మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మళ్లీ రికార్డులు వేట కొనసాగిస్తూ ప్రతి మ్యాచ్లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేస్తూ ఉన్నాడు. అయితే మొన్నటికి మొన్న వరల్డ్కప్ లో అదిరిపోయే బ్యాటింగ్ తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన కోహ్లీ.. ఇక ఇప్పుడు బాంగ్లాదేశ్ తో వరుసగా సిరీస్ లు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.


 బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఇప్పటికే బంగ్లా గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ లో ముందుకు తేలుతుంది. ఇక రేపటి నుంచి బంగ్లాదేశ్, భారత్ మధ్య వన్డే మ్యాచ్ జరగబోతుంది. అయితే ఇక మొదటి వన్డే మ్యాచ్ లో భాగంగా విరాట్ కోహ్లీని ఒక అరుదైన రికార్డు ఊరిస్తుంది అని చెప్పాలి. కోహ్లీ మరో 30 పరుగులు చేశాడు అంటే అరుదైన ప్రపంచ రికార్డులు నెలకొల్పుతాడు. ఏ దేశంలోనైనా అత్యంత వేగంగా వన్డే మ్యాచ్లలో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ఘనత సాధిస్తాడు. ఇప్పుడు వరకు బంగ్లాదేశ్లో విరాట్ కోహ్లీ 88 సగటుతో 970 పరుగులు చేశాడు. ఇక గతంలో ఇంగ్లాండులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బంగ్లాదేశ్లో 18 మ్యాచ్ల్లో 1000 పరుగులు చేయగా.. ఇక ఇప్పుడు కోహ్లీ 30 పరుగులు చేస్తే 16 మ్యాచుల్లోనే  ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: