ప్రస్తుతం పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టిన ఇంగ్లాండ్ జట్టు ఇక ఆతిథ్య పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే మొదటి టెస్ట్ మ్యాచ్ ఎవరి ఊహకుందని విధంగా హోరాహోరీగా జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగానే ఇరుజట్లు కూడా పోటీ పడ్డాయి అని చెప్పాలి. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో భాగంగా పరుగుల వరద పారింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు టి20 తరహాలో రెచ్చిపోయారు అనుకుంటే.. ఇక ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు సైతం అదే స్థాయిలో పరుగుల వరద పారించారు.


 నువ్వా నేనా అన్నట్లుగా పోరు జరుగుతున్న తీరు చూస్తే ఇక భారీ  స్కోర్లు నమోదు అవ్వడంతో ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలకుండానే డ్రా గా ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అటు పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండు తమ ముందు నిర్దర్శించిన లక్ష్యాన్ని చేదించడంలో పాకిస్తాన్ జట్టు బ్యాట్స్మెన్లు విఫలమయ్యారు. దీంతో మొదటి మ్యాచ్లో ఓటమి పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్లో ఓటమితో ఇప్పటికే నిరాశలో ఉన్న పాకిస్తాన్ కు మరో బిగ్ షాక్ తగిలింది.



 పాకిస్తాన్ జట్టులో స్టార్ పెసర్గా కొనసాగుతున్న హరీష్ రౌఫ్ గాయం కారణంగా సిరీస్లో మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్లకు కూడా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. మొదటి టెస్ట్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో హరీష్ రౌఫ్ కాలికి గాయమైంది. దీంతో అతను మైదానాన్ని వీడాడు. ఈ క్రమంలోనే అతని ఆసుపత్రికి తరలించి స్కానింగ్ చేయగా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే మిగతా రెండు టెస్టులకు అతను దూరం కాబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఏకంగా నెలరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం .

మరింత సమాచారం తెలుసుకోండి: