ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా రికార్డుల రారాజు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇక ఎన్ని పరుగులు చేసిన ఇంకా పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగానే అతని బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకే విరాట్ కోహ్లీ రన్ మెషిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎన్నో ఏళ్లపాటు టీం ఇండియాకు కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఈరోజు అటు విరాట్ కోహ్లీ కెరియర్ లో ఎంతో ప్రత్యేకమైన రోజు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఎందుకంటే సరిగా ఎనిమిదేళ్ల క్రితం 2014లో ఇదే రోజు ఆస్ట్రేలియా తో జరిగిన టెస్ట్ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవహరించాడు. అయితే అప్పుడు టీమిండియా కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని గాయపడటంతో.. ఇక తొలిసారి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. సారధిగానే కాదు ఒక ఆటగాడిగా కూడా అదరగొట్టాడు. ఏకంగా రెండు సెంచరీలు చేశాడు. అయినప్పటికీ సిరీస్ మాత్రం దక్కలేదు అని చెప్పాలి. అయితే ఈ సిరీస్ తర్వాత ధోని టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్ గా అవతరించాడు అని చెప్పాలి. అందుకే ఇక ఈరోజు కోహ్లీ కెరియర్ లోనే ఎప్పటికీ ప్రత్యేకమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి