ఇటీవల కాలంలో టీమిండియాలో అవకాశం దక్కించుకుంటున్న యువ ఆటగాళ్లు అసమాన్యమైన ప్రదర్శనతో అందరూ చూపును తన వైపుకు తిప్పుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీ చేశాడు. ఇక సెంచరీ తో ఆగిపోతాడని అందరు అనుకున్నారు. అతని అవుట్ చేయడానికిన్యూజిలాండ్ బౌలర్లు సర్వ ప్రయత్నాలు చేశారు. కానీ సెంచరీని డబుల్ సెంచరీగా మలిచి ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన అతిపిన వయస్కుడిగా శుభమన్ గిల్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.


 అంతేకాదు ఇలా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో శుభమన్ గిల్ చేసిన అదిరిపోయే డబుల్ సెంచరీ కారణంగా అతను క్రియేట్ చేసిన రికార్డులు ఒక్కొక్కటి తెరమీదకి వస్తూ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని అద్వితీయమైన ఇన్నింగ్స్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇక శుభమన్ గిల్ చేసిన డబుల్ సెంచరీ కారణంగా ఇక వేగంగా వన్డే ఫార్మాట్లో వెయ్యి పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. కాగా ఇటీవలే వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన రికార్డును కూడా గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.


 అత్యధిక యావరేజ్ తో పాటు అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉండి ఇక 1000 పరుగులను పూర్తి చేసుకున్న బ్యాట్స్మెన్ గా ఎంతోమంది స్టార్ బ్యాట్స్మెన్లను సైతం వెనక్కి పెట్టి శుభమన్ గిల్ అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. వెయ్యి పరుగులు పూర్తి చేసుకునే క్రమంలో శుభమన్ గిల్ బ్యాటింగ్ యావరేజ్ 60 ప్లస్ ఉండగా ఇక స్ట్రైక్ రేట్ 100 ప్లస్ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇలా ఎక్కువ యావరేజ్ ఎక్కువ స్ట్రైక్ రేటుతో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా శుభమన్ గిల్ ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త రికార్డును తన పేరున లికించుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gi